ర్యాగింగ్ పై ప్రభుత్వాలు , విద్యాసంస్థలు ఉక్కుపాదం మోపుతున్న అడపాదడపా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ర్యాగింగ్ (Ragging) అనేది విద్యాసంస్థల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను వేధించడానికి, అపమానించడానికి, లేదా భయపెట్టడానికి చేసే చట్టవ్యతిరేక చర్య. ఈ చర్యలు మనోభావాలను దెబ్బతీసే అవమానకరమైన చర్యలుగా, శారీరకంగా లేదా మానసికంగా వేధింపుగా జరగవచ్చు.
ఈ ర్యాగింగ్ వల్ల కొంతమంది బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడం, కొందరు డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తుంటారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు అవ్వడం , జైలు శిక్ష మరియు భారీ జరిమానాలు విధించడం వంటివి పోలీసులు చేస్తున్నప్పటికీ కొన్ని కాలేజీలలో సీనియర్స్ మారడం లేదు. గుట్టుచప్పుడుగా జూనియర్స్ పై ర్యాగింగ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా గుజరాత్ లో దారుణం జరిగింది.సీనియర్ల ర్యాగింగ్ (Ragging)కు ఓ వైద్య విద్యార్థి (Medical Student) బలయ్యాడు. పటాన్‌లోని ధర్‌పూర్‌లో గల జీఎమ్‌ఈఆర్‌ఎస్ మెడికల్ వైద్య కళాశాలలో (GMERS Medical College and Hospital) ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన ప్రకారం..
అనిల్ మథానియా (Anil Methaniya) అనే విద్యార్థి (MBBS student) జీఎమ్‌ఈఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ (GMERS Medical College) లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే, శనివారం రాత్రి ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో సీరియర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌లో భాగంగా అనిల్‌ను సీనియర్లు దాదాపు మూడు గంటల పాటు నిలబెట్టారు. దీంతో అనిల్ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి చేరుకుని కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే అతిన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు. చికిత్స పొందుతూ అనిల్ ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన అనంతరం సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ వల్లే అనిల్ మరణించాడంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై మేనేజ్‌మెంట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. సదరు విద్యార్థులను హాస్టల్, కళాశాల నుంచి సస్పెండ్ చేసినట్లు మెడికల్ వైద్య కళాశాల అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై ఈ చర్యలు అమల్లో ఉంటాయని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై \కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Read Also : Maharashtra Assembly Elections 2024 : మోడీని ఆ మాటలతో అవమానించారు – పవన్ కళ్యాణ్