Site icon HashtagU Telugu

JIO : గుజరాత్ లో ఇక అంతా జియో మాయం.. ప్రభుత్వ సెల్ ఫోన్స్ అన్ని ఇకపై జియోనే..

Gujarat Government Phones will use Jio from now

Gujarat Government Phones will use Jio from now

తాజాగా గుజరాత్(Gujarat) ప్రభుతం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వారి ఆఫీస్ కి, వర్క్ కి సంబంధించిన ఫోన్స్ లలో(Phones) ఇక నుంచి కచ్చితంగా జియో(Jio) సిమ్ వాడాలని ఆదేశాలు జారీ చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఇకపై అందరూ కేవలం జియో నెట్​వర్క్​ను మాత్రమే వినియోగించాలని సూచించారు. గుజరాత్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫోన్స్ ని అందించింది. 12 ఏళ్ళ నుంచి ఈ ఫోన్స్ లో వొడాఫోన్(Vodaphone) నెట్ వర్క్ నడుస్తుంది.

12 ఏళ్ళ క్రితం గుజరాత్ ప్రభుత్వ సెల్ ఫోన్స్ కి సేవలు అందించేందుకు బిడ్స్ కి ఆహ్వానించగా అప్పుడు వొడాఫోన్ ఈ బిడ్ గెలుచుకుంది. ఇటీవలే దాని కాల పరిమితి అయిపోగా మరోసారి బిడ్స్ కి గుజరాత్ ప్రభుత్వం ఆహ్వానించగా ఈ సారి గుజరాత్ ప్రభుత్వ సెల్ ఫోన్స్ కి సేవలు అందించేందుకు జియో బిడ్ ను గెలుచుకుంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వాడుతున్న అన్ని వొడాఫోన్​-ఐడియా సర్వీసులను కూడా జియోలో మారుస్తున్నట్టు తెలిపింది గుజరాత్ ప్రభుత్వం. కేవలం రూ.37.50కే పోస్ట్​పెయిడ్​ సేవలను గుజరాత్ ప్రభుత్వ సెల్ ఫోన్స్ కు అందించనున్నట్లు జియో ప్రకటించింది. జియో నంబర్ తో ఏ మొబైల్​ ఆపరేటర్​కైనా, ల్యాండ్​లైన్​కైనా కాల్​ చేయవచ్చని, నెలకు 3వేల ఉచిత SMSలను వాడుకోవచ్చని, నెలకు 30 జీబీ డేటా 4జీతో అందిస్తామని జియో తెలిపింది. దీంతో గుజరాత్ ప్రభుత్వానికి మరింత లాభం చేకూరనుంది.

 

Also Read :  Whatsapp: అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయా.. అయితే వెంటనే అలా చేయండి?