డ్ర‌గ్స్ అడ్డా గుజ‌రాత్.. ముంద్రా ఓడ‌రేవుపై ఆదానీ మార్క్‌

గుజరాత్ బుజ్ లోని ముంద్రా ఓడ‌రేవు ఆదానీ గ్రూపు నిర్వ‌హణ‌లో ఉంది. అక్క‌డి నుంచి 72వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ దిగుమ‌తి అయ్యాయి. నేర సామ్రాజ్యాన్ని స్థాపించి..ఇండియా న‌లుమూల‌ల‌కు డ్ర‌గ్స్ ను చేర‌వేస్తున్నారు. ఆ విష‌యాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం వెల్ల‌డించారు.

  • Written By:
  • Publish Date - September 25, 2021 / 01:51 PM IST

గుజరాత్ బుజ్ లోని ముంద్రా ఓడ‌రేవు ఆదానీ గ్రూపు నిర్వ‌హణ‌లో ఉంది. అక్క‌డి నుంచి 72వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ దిగుమ‌తి అయ్యాయి. నేర సామ్రాజ్యాన్ని స్థాపించి..ఇండియా న‌లుమూల‌ల‌కు డ్ర‌గ్స్ ను చేర‌వేస్తున్నారు. ఆ విష‌యాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం వెల్ల‌డించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్ర‌గ్స్ దిగుమ‌తి వెనుక అధికారంలో ఉండే వాళ్ల లేకుండా సాధ్య‌మా? అంటూ ఆయ‌న ప్ర‌శించారు. డ్ర‌గ్స్ దిగుమ‌తి మీద ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గానీ ఎందుకు స్పందించ‌లేద‌ని నిల‌దీశారు. అంతేకాదు, ముంద్రా ఓడ‌రేవు నుంచి దిగుమ‌తి. అయిన డ్ర‌గ్స్ వివ‌రాల‌ను చిదంబ‌రం బ‌య‌ట‌పెట్టారు.
ఆయ‌న చెబుతోన్న దాని ప్ర‌కారం…పాకిస్తాన్, ఇరాన్, ఆప్ఘ‌నిస్తాన్ నుంచి డ్ర‌గ్స్ దిగుమ‌తి అవుతున్నాయి. దానికి ఇండియాలో కేంద్రంగా ముంద్రా ఓడ‌రేవు ఉన్న‌ది. గుజ‌రాత్ తీర‌ప్రాంతంలోని ఓడ‌రేవుల కేంద్రంగా నేర సామ్రాజ్యాన్ని స్థాపించారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దిగుమ‌తి అయిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని చిదంబ‌రం వివ‌రించారు.
గుజ‌రాత్ ఓడ‌రేవుల్లో 2017 జూలైన 1500 కేజీల డ్ర‌గ్స్ ను పట్టుకున్నారు. వాటి విలువ‌ను 3,500 కోట్లుగా నిర్థారించారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో పాకిస్తాన్ కు చెందిన ఐదుగురు ప్ర‌యాణిస్తోన్న చేప‌ల వేట బోటును సీజ్ చేయ‌గా డ్ర‌గ్స్ దొరికాయి.వాటి విలువ 175 కోట్లుగా లెక్కించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో పాకిస్తాన్ కు చెందిన బోట్ ను పట్టుకున్నారు. 150 కోట్ల విలువైన డ్ర‌గ్స్ ను వాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ త‌నిఖీల్లో దొరికిన డ్ర‌గ్స్ వివ‌రాలివి. తాజాగా ముంద్రా పోర్ట్ నుంచి దిగుమ‌తి అవుతోన్న డ్ర‌గ్స్ కు సంబంధించిన త‌నిఖీల‌ను గుజ‌రాత్ పోలీస్, యాంటీ టెర్రరిస్గ్ స్క్వాడ్ రైడ్ చేసింది. 21వేల కోట్ల విలువవైన డ్ర‌గ్స్ ను సీజ్ చేసింది. సెప్టెంబ‌ర్ 18న‌ 150 కోట్ల విలువై డ్ర‌గ్స్, సెప్టెంబ‌ర్ 17న మూడు ట‌న్నుల డ్ర‌గ్స్ ను కోస్ట్ గార్డ్స్, గుజ‌రాత్ పోలీస్, యాంటీ టెర్ర‌రిస్ట్ సంయుక్త త‌నిఖీల్లో సీజ్ చేశారు. ఈ వివ‌రాల‌ను చిదంబ‌రం వెల్ల‌డించారు. గుజరాత్ కేంద్రంగా జ‌రుగుతోన్న ఈ డ్ర‌గ్స్ దిగుమ‌తి వెనుక ఉన్న ర‌హ‌స్యాన్ని తేల్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.