Site icon HashtagU Telugu

Gujarat : విదేశీ మ‌ద్యం స్మ‌గ్లింగ్ కేసులో గుజ‌రాత్ కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు అరెస్ట్‌

Gujarat Police

Gujarat Police

విదేశీ మద్యం అక్ర‌మ ర‌వాణా కేసులో కాంగ్రెస్ నాయకురాలు మేఘనా పటేల్‌ను గుజరాత్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 10 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మేఘనా పటేల్‌ను అరెస్టు చేశారు. బొలెరో కారులో మద్యం స్మగ్లింగ్ గురించి త‌మ‌కు సమాచారం వ‌చ్చింద‌ని… కారు పిప్లాడ్ రోడ్డు ప్రాంతం నుండి వెళ్లాల్సి ఉండ‌గా.. ఆ స‌మ‌యంలో త‌మ బృందం కారుని ఆపామాని సీనియ‌ర్ పోలీస్ అధికారి తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా.. మేఘనా పటేల్ కోసం రూ.7.5 లక్షలకు పైగా విలువైన విదేశీ మద్యం తీసుకొచ్చినట్లు తేలింది.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేఘనా పటేల్ మాజీ మ‌హిళా ఉపాధ్య‌క్షురాలుగా ప‌ని చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఈమె మద్యం సరుకును తీసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సరుకును ఎవరికి విక్రయించారో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మేఘనా పటేల్ తో పాటు కారు డ్రైవర్‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.