Site icon HashtagU Telugu

Guinness World Record: 1.53లక్షల మంది ఒకేసారి యోగా.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు

Guinness World Record

Guinness World Record

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం (International Yoga Day) సంద‌ర్భంగా గుజ‌రాత్ లో గిన్నిస్‌ వ‌ర‌ల్డ్ రికార్డు (Guinness World Record) న‌మోదైంది. సూరత్‌ (Surat) లోని డుమాస్ ప్రాంతంలో జ‌రిగిన యోగా కార్య‌క్ర‌మంలో గుజ‌రాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్ (Gujarat CM Bhupendra Patel) పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 1.53ల‌క్ష‌ల మంది ఒకేసారి యోగాలో వివిధ ఆస‌నాలు చేశారు.దీంతో ఇది గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో చోటు ద‌క్కించుకుంది. దీంతో గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు ప్ర‌తినిధులు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ యోగా వేడుక‌ల్లో 1.25ల మంది పాల్గొనే అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే, ఊహించిన దానికంటే ఎక్కువ‌గా 1.50 ల‌క్ష‌ల మంది పాల్గొన్నారు.

ఇదిలాఉంటే 2018లో రాజ‌స్థాన్‌లోని కోటాలో జ‌రిగిన యోగా డే సెష‌న్‌లో 1,00,984 మంది పాల్గొన‌డం అప్ప‌ట్లో రికార్డు సృష్టించింది. దాన్ని సూర‌త్ కార్య‌క్ర‌మంలో బ‌ద్ద‌లు కొట్టి స‌రికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

సీఎం భూపేంద్ర ప‌టేల్ మాట్లాడుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ యోగాకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చార‌ని కొనియాడారు. క‌రోనా స‌మ‌యంలో యోగా, ప్రాణాయామం ప్ర‌జ‌ల‌కు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని అన్నారు. యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావ‌టానికి ప్ర‌భుత్వం త్వ‌ర‌లో 21 యోగ్ స్టూడియోల‌ను ప్రారంభించ‌నున్నామ‌ని సీఎం ప్ర‌క‌టించారు.

CM KCR: సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వ‌స్తుంద‌ని హామీ ఇచ్చిన‌ కేసీఆర్‌.. కానీ, ఒక్క ష‌ర‌తు