GST: ప్యాక్ చేసి లేబుల్ వేసిన మాంసం, పన్నీర్, చేపలు, తేనె, పెరుగుపై జీఎస్టీ, రూ.1000లోపు హోటల్ రూములపైనా…

అసలే ధరలు పెరిగి పూట గడవడమే కష్టంగా మారుతున్న రోజులివి. అలాంటిది ఇప్పుడు మధ్యతరగతిపై మళ్లీ భారాన్ని మోపింది కేంద్రం.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 10:09 AM IST

అసలే ధరలు పెరిగి పూట గడవడమే కష్టంగా మారుతున్న రోజులివి. అలాంటిది ఇప్పుడు మధ్యతరగతిపై మళ్లీ భారాన్ని మోపింది కేంద్రం. మాంసం, పన్నీర్, చేపలు, తేనె, పెరుగు… ఇలాంటి ప్యాక్ చేసిన, లేబుల్ వేసిన ఆహార వస్తువులపై ఇకనుంచి జీఎస్టీని వసూలు చేస్తారు. హోటల్ లో రూ.1000 లోపు గదిని అద్దెకు తీసుకున్నా దానిపై 12 శాతం జీఎస్టీని వసూలు చేస్తారు. చెక్ ల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపైనా జీఎస్టీ భారం పడనుంది.

ఆసుపత్రుల్లో ఐసీయూలు మినహా.. రోజుకు రూ.5000 కన్నా ఎక్కువ అద్దె ఉన్న గదులను తీసుకుంటే.. దానిపై 5 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీసు సేవలపైనా ఇకపై జీఎస్టీ కట్టాల్సిందే. కాకపోతే 10 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న ఇన్ లాండ్ లెటర్లు, పోస్టు కార్డులు, ఎన్వెలప్ లు, బుక్ పోస్ట్ లను ఇందులోనుంచి మినహాయించారు. చెక్ లు, ఇన్ బుక్ ఫామ్ పై ఏకంగా 18 శాతం జీఎస్టీని వసూలు చేయవచ్చు.

దేశంలో అన్ని వస్తుసేవల ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మధ్యతరగతి, దిగువతరగతికి కాస్తయినా ఉపశమనం లభిస్తుంది అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా పన్నుల వాత పెట్టింది కేంద్రం. నిత్యం వాడే వస్తువులు, ఆసుపత్రి సేవలపై జీఎస్టీని విధించినా, ఉన్నదానిని పెంచినా ఆ భారం దేశంలో కొన్ని పదుల కోట్లమందిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. అసలే రానున్నది ద్రవ్యోల్బణ కాలం. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తీవ్రంగా ప్రభావమయ్యే అవకాశముందంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో జీఎస్టీ మోత వల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని చెబుతున్నారు.