GSAT-24 : విజయవంతంగా జీశాట్ 24 ప్రయోగం..!!

భారత్ రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు.

Published By: HashtagU Telugu Desk
GSAT 24

GSAT 24

భారత్ రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు. ఫ్రాన్స్ లోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్షకేంద్రం నుంచి ఏరియన్ -5 రాకెట్ ద్వారా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ సంయూక్తంగా రూపొందించిన GSAT-24కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున సక్సెస్ ఫుల్ గా రోదసీలోకి ప్రవేశపెట్టారు. 4,180 కిలోల బరువు ఉన్న జీశాట్-24ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో 24కేయూ బ్యాండ్ ట్రాన్స్ ఫాండర్లు అమర్చారు. DTH అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో రోదసీకి పంపించారు.

ఇక ఇప్పటివరకు 4వేల కిలోల పైన బరువు కలిగిన భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడంలోభాగంగా బుధవారం ఈ ప్రయోగాన్నినిర్వహించారు. జీశాట్-25తో డీటీహెచ్ అప్లికేషన్ లో లెటెస్ట్ టెక్నాలజీని అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 6గంటలకు PSLV C53ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

  Last Updated: 23 Jun 2022, 09:26 AM IST