Site icon HashtagU Telugu

Varun Singh : మృతువుతో పోరాడిన ఓడిన కెప్టెన్ వరుణ్ సింగ్

Varun Singh

Varun Singh

భారత తొలి చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) బిపిన్ రావత్, అయన భార్య మధూళిత రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్నహెలికాఫ్టర్ తమిళనాడులో కుప్పకూలి 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగళూరు కమాండ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ నేడు మరణించారు. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 8న హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ ను వెల్లింగ్టన్ ఆసుపత్రి లో చేర్పించి చికిత్స అందించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం బెంగళూరు లోని కమాండో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వరం రోజులుగా మృత్యువుతో పోరాడి నేడు తుదిశ్వాస విడిచారని భారత వాయుసేన ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ విచారణ వ్యక్తం చేసింది. ఈ విషయం పై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ క్యాప్టిన్ వరుణ్ సింగ్ కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.