Site icon HashtagU Telugu

Shaliza Dhami: ఇదే తొలిసారి.. ఫ్రెంట్‌లైన్‌ కంబాట్‌ యూనిట్‌ కమాండర్‏గా షాలిజా ధామి

Shaliza Dhami

Resizeimagesize (1280 X 720) (1)

గత కొన్నేళ్లుగా భారత సాయుధ దళాల్లో మహిళల సంఖ్య వేగంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా బలగాల్లో మహిళల పాత్రను పెంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)లో కూడా మహిళలు బలమైన ఉనికిని చాటుతున్నారు. IAF వెస్ట్రన్ సెక్టార్‌లో ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్‌కు నాయకత్వం వహించడానికి గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి (Shaliza Dhami)ని ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని పశ్చిమ విభాగంలో గ్రూప్ కెప్టెన్ గా విధులు నిర్వహిస్తున్న షాలిజ ధామిని పాకిస్థాన్ సరిహద్దులో మిస్సైల్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా నియమించింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోగ్రూప్ కెప్టెన్ గా ఉంటున్న ఆమె . ఇలా కీలకమైన కంబాట్ యూనిట్ బాధ్యతలు నిర్వహించనున్న తొలి మహిళగా చరిత్ర స్రుష్టించింది. భారత వైమానిక దళం చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా అధికారికి ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్‌కు కమాండ్‌ని అప్పగించారు. ఈ నెల ప్రారంభంలో సైన్యం మొదటిసారిగా మెడికల్ స్ట్రీమ్ వెలుపల మహిళా అధికారులకు కమాండ్ పాత్రలను కేటాయించడం ప్రారంభించింది. వీరిలో దాదాపు 50 మంది ఆపరేషనల్ సెక్టార్‌లో యూనిట్లకు అధిపతిగా ఉంటారు.

Also Read: International Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

గ్రూప్ కెప్టెన్ ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా నియమితులయ్యారు. 2,800 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఉంది. ఆమె క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ కూడా. ఆమె పశ్చిమ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ ఆర్మీలో కల్నల్‌తో సమానం. రెండు పర్యాయాలు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ చేత ప్రశంసలు పొందిన తరువాత, ఆ అధికారి ప్రస్తుతం హెడ్‌క్వార్టర్స్ ఫ్రంట్‌లైన్ కమాండ్ ఆపరేషన్స్ బ్రాంచ్‌లో పోస్ట్ చేయబడ్డారు.

Exit mobile version