Gold Sales: భారత ప్రభుత్వ గోల్డ్ బాండ్స్ సేల్స్ నేటి నుంచే.. ఇలా కొనండి

ఈ గోల్డ్ బాండ్స్ భారీ తగ్గింపుతో లభిస్తాయి. పసిడిపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఆకర్షణీయ స్కీమ్‌. కేంద్ర ప్రభుత్వం తరఫున వీటిని

పసిడి (Gold) ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. దీంతో గోల్డ్ కొనాలంటే ఓసారి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి వారికి మంచి అవకాశం.. “సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ – 2022-23 సిరీస్ 4”. ఈ గోల్డ్ బాండ్స్ భారీ తగ్గింపుతో లభిస్తాయి. పసిడిపై (Gold) ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఆకర్షణీయ స్కీమ్‌. కేంద్ర ప్రభుత్వం తరఫున వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్ముతోంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఈరోజు ( మార్చి 6 ) నుంచే ప్రారంభం అవుతంది. మార్చి 10 వరకు మాత్రమే డిస్కౌంట్‌ ఆఫర్ ఉంటుంది. ఈనేపథ్యంలో గోల్డ్ బాండ్లను ఎలా, ఎక్కడ కొనుగోలు చేయాలి? అనే వివరాలను తెలుసుకుందాం.

ఆఫర్ ఏమిటి?

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఇష్యూ ధర గ్రాముకు రూ.5,611గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐతో చర్చలు జరిపి ఇన్వెస్టర్లు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే గ్రాముకు రూ.50 మేర డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. పేమెంట్స్ డిజిటల్ మోడ్‌లో చేసే వారికి ఇది వర్తిస్తుంది. ఇలా ఆన్‌లైన్, డిజిటల్ పద్ధతిలే కొనుగోలు చేసే ఇన్వెస్టర్లకు బంగారం గ్రాముకు రూ.5,561కే లభిస్తుంది.

ఎక్కడ కొనాలి?

సావరిన్ గోల్డ్ బాండ్లను గుర్తింపు పొందిన బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటేడ్, గుర్తింపు పొందిన పోస్టాఫీసులు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజిల ద్వారా కొనొచ్చు. పోస్టాఫీసుల విషయానికి వస్తే అన్నింట్లో ఈ అవకాశం ఉండదు. కొన్ని ఎంపిక చేసిన వాటిల్లోనే విక్రయిస్తారు.

లాకిన్ పీరియడ్ ఎంత?

ఈ బాండ్లలో ఏడాదికి గరిష్టంగా 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పరిమితి 1 గ్రాము బంగారం.ఈ సావరిన్ గోల్డ్ బాండ్ల టెన్యూర్ అనేది 8 ఏళ్లుగా ఉంటుంది. అయితే, 5 ఏళ్ల తర్వాత ప్రీమెచ్యూర్ రిడంప్సన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ బాండ్లు గ్రాముల ప్రాతిపదికన లభిస్తాయి. కనిష్ఠంగా ఒక గ్రాము నుంచి అందుబాటులో ఉంటాయి. మెచ్యూరిటీ పీరియడ్ 8 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే, ఒక వ్యక్తి 4 కిలోల వరకు మాత్రమే గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టొచ్చు. ట్రస్టుల వంటి వాటికి మాత్రం గరిష్ఠంగా 20 కిలోల వరకు అవకాశం ఉంటుంది.మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత SGB రిడీమ్‌పై ఎలాంటి పన్ను విధించబడదు.  అయితే, మీరు దానిని 36 నెలల ముందు విక్రయిస్తే, అది స్వల్పకాలిక మూలధన లాభాలుగా పన్ను విధించబడుతుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుంది. 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచిన బంగారం కోసం, ఇది దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించబడుతుంది. ఇండెక్సేషన్ తర్వాత 20 శాతం పన్ను విధించబడుతుంది

లాభాలు ఇవీ?

  1. బంగారం ధర భవిష్యత్తులో పెరిగితే ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. వడ్డీ అందుతుంది.
  2. బంగారం ప్రస్తుత ధరకు కొనుగోలు చేసి ఎక్కువైన సందర్భంలో విక్రయించవచ్చు.
  3. గోల్డ్ బాండ్లపై తరుగు ఉండదు.
  4. చెల్లింపులు క్యాష్ రూపంలో ఉంటాయి.
  5. దొంగతనం జరుగుతుందన్న భయం ఉండదు.
  6. బ్యాంకుల్లో కూడా తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు.
  7. బంగారం రేటు తగ్గితే తప్ప పెద్ద నష్టాలేనవి ఏమీ ఉండవు.

Also Read:  Pawan Sabha: కాపు కోటలో పవన్ సభ, ఇద్దరు నానిల ఇలాఖలో శంఖారావం