Retirement Age: పదవీ విరమణ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన..!

ప్రభుత్వ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్‌బి) అధిపతుల పదవీ విరమణ వయస్సు (Retirement Age)ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 11:30 AM IST

Retirement Age: వివిధ మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్‌బి) అధిపతుల పదవీ విరమణ వయస్సు (Retirement Age)ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పిటిఐతో మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారుల పదవీకాలాన్ని 65 సంవత్సరాలకు పొడిగించే ప్రతిపాదన ప్రభుత్వానికి అందిందని చెప్పారు. అదే సమయంలో LIC, SBI చైర్మన్ పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచవచ్చు.

ఎండీ పదవీ విరమణ వయస్సు పెరగవచ్చు

PTI నివేదిక ప్రకారం.. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్ పదవీ విరమణ వయస్సును 1 నుండి 2 సంవత్సరాల వరకు పెంచవచ్చు. ఈ సందర్భంలో అది 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెరుగుతుంది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఛైర్మన్ దినేష్ ఖరా పదవీ విరమణ వయస్సు 63 సంవత్సరాలు. అతని పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టు 2023లో ముగుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో రెండేళ్లు పొడిగిస్తే 65 ఏళ్ల వరకు పదవీకాలం ఉంటుంది.

అదే సమయంలో ఎల్‌ఐసి చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి పదవీకాలం జూన్ 29, 2024తో ముగుస్తుంది. చైర్మన్, ఎండీల పదవీ విరమణ వయస్సును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే అది ఖచ్చితంగా ఎల్‌ఐసీ చైర్మన్, ఎండీ పదవీ విరమణ వయస్సుపై ప్రభావం చూపుతుంది.

Also Read: G20 Summit 2023: G20 సమ్మిట్.. విజయవంతం చేయాల్సిన బాధ్యత ఢిల్లీ ప్రజలదే

పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోంది

బ్యాంకులు, పిఎస్‌బిల సీనియర్ అధికారుల పదవీకాలాన్ని పెంచడం, తద్వారా బ్యాంకుల నిర్ణయాలలో స్థిరత్వం తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. ఇది బ్యాంకులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం సులభతరం చేస్తుంది. ఈ వ్యవస్థ చాలా కాలం పాటు ప్రభావవంతంగా ఉంటుంది. ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా పదవీకాలాన్ని 10 నెలలు పొడిగిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు రావడం గమనార్హం.

సీనియర్ అధికారి పదవీ విరమణను పెంచే ఆలోచన చేయడం ఇదే మొదటిసారి కాదని గమనించాలి. అంతకుముందు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఉద్యోగుల) రెగ్యులేషన్ 1960లో సవరణ ద్వారా LIC ఛైర్మన్ పదవీ విరమణ 2021 సంవత్సరంలో 62 సంవత్సరాలకు పెంచబడింది.