Site icon HashtagU Telugu

EPFO : ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి పెంపు!

PF Amount Withdraw

PF Amount Withdraw

Central Government: ఈపీఎఫ్ఓ(EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం(Central Government)భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉంది. ఈ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచే యోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మొత్తాన్ని పెంచాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి పెంపుకు సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రయివేటు రంగం పైనా భారం పడుతుంది. అయితే ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది.

Read Also:Pithapuram Politics : పిఠాపురంలో వైసీపీలో గందరగోళం.. జనసేనాని గెలుపు ఖాయం..!

వేతన పరిమితి పెంచడం వల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేర పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. గరిష్ఠ వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్‌ ఖాతాలో జమయ్యే మొత్తం పెరుగుతుంది. దీంతో పదవీ విరమణ సమయానికి ఉద్యోగి తన భవిష్యనిధి నిల్వలను పెంచుకోవడానికి వీలుపడుతుంది.

Read Also:YS Sharmila : జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తూనే ఉంది – షర్మిల

అంతకుముందు ఇటీవలె ఉద్యోగుల భవిష్య నిధి(EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటును ఖరారు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటును నిర్ణయించింది. గత మూడేళ్లలో ఇదే అత్యధికం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించింది. అంతకు ముందు 2021-22లో 8.10శాతం వడ్డీ చెల్లించారు.