Site icon HashtagU Telugu

Dawood Properties : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎన్ని ఆస్తులున్నాయంటే ?

Dawood Hospitalized

Dawood Hospitalized

Dawood Properties : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఆస్తుల వేలానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనవరి 5న దావూద్ ఆస్తులను వేలం వేయనున్నారు.  మహారాష్ట్రలోని ముంబై, రత్నగిరి ఏరియాల పరిధిలో దావూద్ పేరిట ఉన్న పలు స్థిరాస్తులను విదేశీ మారక ద్రవ్య చట్టం (సఫ్మా) కింద అధికారులు సీజ్ చేశారు. రత్నగిరి పరిధిలోని ఖేడ్ తాలూకాలో ఉన్న బంగ్లాలు, మామిడి తోటలు సహా నాలుగు ఆస్తులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వాటన్నింటిని  వచ్చే నెల 5వ తారీఖున వేలం వేస్తారు.దావూద్ ఆస్తులను వేలం వేయడం ఇదే తొలిసారేం కాదు. గతంలో దావూద్ సంబంధీకులకు చెందిన ఓ రెస్టారెంట్‌ను రూ.4.53 కోట్లకు, ఆరు ఫ్లాట్లను రూ.3.53 కోట్లకు, ఒక గెస్ట్ హౌస్‌ను రూ.3.52 కోట్లకు కేంద్ర సర్కారు వేలం వేసింది. చివరిసారిగా 2020 డిసెంబరులో రత్నగిరిలోని దావూద్ ఆస్తులను వేలం వేయగా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.10 కోట్లు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: 3 Step Plan : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ముగించడానికి 3 దశల ప్లాన్

మరోవైపు పాకిస్తాన్‌లో దావూద్‌పై విష ప్రయోగం జరిగిందనే వార్తలు వినవస్తున్నాయి. అయితే వాటిని దావుద్ సన్నిహితుడు చోటా షకీల్ కొట్టిపారేశాడు. అండర్ వరల్డ్ డాన్ బతికే ఉన్నాడని ప్రకటించాడు. 1993లో ముంబై నగరంలో 250 మందిని పొట్టనబెట్టుకుని ముంబై పేలుళ్లకు సూత్రధారి దావూద్ ఇబ్రహీమే. పాకిస్తాన్‌లో ఉంటున్న దావూద్.. మాహె జబీన్ అనే పాకిస్తానీ పఠాన్ తెగకు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పటికీ అతడు తమ దేశంలోనే లేడని పాకిస్తాన్ వాదిస్తోంది.