Site icon HashtagU Telugu

Bharat Dal-60 Per Kg : కేజీ రూ.60కే “భారత్ దాల్” శెనగ పప్పు

Bharat Dal 60 Per Kg

Bharat Dal 60 Per Kg

Bharat Dal-60 Per Kg : ఇప్పటికే ధరల మంటతో పేదలు టమాటాను కూరల్లో వాడటం మానేశారు. మరోవైపు పప్పుల ధరలు కూడా అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో శెనగ పప్పు ధర కిలోకు రూ.70 నుంచి రూ.80 దాకా  పలుకుతోంది. ఈనేపథ్యంలో పప్పుల ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.  ఈక్రమంలో “భారత్ దాల్” బ్రాండ్ పేరుతో సరసమైన ధరలకు శెనగ పప్పు ప్యాకెట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

Also read : Mahesh Babu: రెమ్యూనరేషన్ లో మహేష్ బాబు సరికొత్త రికార్డ్, గుంటూరు కారం మూవీకి అన్ని కోట్లా!

“భారత్ దాల్” బ్రాండ్ ద్వారా కిలో శెనగ పప్పును వినియోగదారులకు రాయితీపై రూ. 60కే(Bharat Dal-60 Per Kg)  అందుబాటులోకి తేనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 703 నాఫెడ్ స్టోర్‌లు, NCCF, కేంద్రీయ భండార్, మదర్ డైరీ సఫల్ రిటైల్ స్టోర్‌లలో “భారత్ దాల్” ను విక్రయిస్తారు. “భారత్ దాల్” బ్రాండ్ చనా దాల్ పంపిణీ సోమవారం (జులై 16) నుంచే  ప్రారంభమైంది. “భారత్ దాల్” 1 కేజీ ప్యాకెట్ ధర రూ.60.. 30 కేజీల ప్యాకెట్ ను ఒకేసారి కొంటే కేజీకి రూ.55 చొప్పునే పడుతుంది.  సబ్సిడీ ధరలతో భారత్ దాల్ ను మార్కెట్లోకి రిలీజ్ చేయడం ద్వారా  దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా శెనగ పప్పు ధరలు కూడా దిగివస్తాయని అంచనా వేస్తున్నారు.