తాజాగా ప్రభుత్వం ఆఫీస్ అడ్రస్ ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధనలను పలుమార్పులు చేసింది. కాగా కంపెనీ రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ భౌతిక ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను చేసిందట. ఇకపోతే ఈ కొత్త నిబంధనాల ప్రకారం.. కంపెనీ కార్యాలయ చిరునామా భౌతికంగా ధ్రువీకరించబడిన సమయంలో కార్యాలయంలో సాక్షులు ఉండటం చాలా అవసరమట. అదేవిధంగా సాక్షుల సమక్షంలో రెండు ప్రయోజనాలు కూడా ఉంటాయట. ఇందులో మొదటగా అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వారి పై సాక్ష్యాధారాలు ఉంటాయని, ఇక రెండవది ధృవీకరణలో మూడవ వ్యక్తిని సాక్షిగా ఉంచడం ద్వారా మొత్తం పనిలో పారదర్శకత తీసుకువచ్చేందుకు ఉపయోగపడనుందట.
కాగా 2013 చట్ట ప్రకారం కంపెనీల రిజిస్ట్రర్ ఇచ్చిన చిరునామాలో వ్యాపారం సరిగ్గా జరగడం లేదని గుర్తించినట్లయితే కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం భౌతిక ధృవీకరణను చేయవచ్చట. అలాగే ఈ చట్టం కింద భౌతిక ధృవీకరణ నియమం కూడా చేర్చబడింది. కాగా రిజిస్టర్డ్ కంపెనీ ఇచ్చిన చిరునామాలో భౌతిక ధృవీకరణ సమయంలో ఇద్దరు సాక్షులను కలిగి ఉండటం అవసరం.అయితే అడ్రస్ ధృవీకరణ సమయంలో కంపెనీల రిజిస్ట్రర్ రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన పత్రాలను ధృవీకరించవచ్చట.
అలాగే పత్రాల క్రాస్ వెరిఫికేషన్ ఒప్పు లేదా తప్పు తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చినట్లు గానే అవి ఉండాలి. అదేవిధంగా ఆస్తి ఎవరి పేరు మీద ఉందో, అది అద్దెకు ఉంటే, దాని అద్దెకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుందట. భౌతిక ధృవీకరణ సమయంలో రిజిస్ట్రార్ సంస్థ రిజిస్టర్డ్ కార్యాలయం ఫోటోను తీసుకుంటారు. భౌతిక ధృవీకరణ పూర్తయిన తర్వాత లొకేషన్, ఫోటోతో సహా మిగిలిన సమాచారంతో వివరాల నివేదిక తయారు చేయబడుతుందట.