Google vs Microsoft: మైక్రోసాఫ్ట్ వర్సెస్ గూగుల్.. టెక్ దిగ్గజాల మధ్య చాట్ బోట్ వార్..!

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్‌ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్‌ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్‌ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - February 13, 2023 / 07:15 AM IST

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్‌ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్‌ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్‌ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క ఈ ఛాట్‌బోట్‌ టెక్నాలజీతోనే మరింత పదును తేలిన సెర్చ్‌ ఇంజన్‌గా మునుపటి తమ బింగ్ ను ముందుకు తేనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఈ ఛాట్‌ బోట్స్‌ ద్వారా సంక్లిష్ట అంశాల్ని సైతం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పడానికి కృత్రిమమేధతో నడిచే ఈ ఛాట్‌బోట్స్‌ ఉపకరిస్తాయి.

గత ఏడాది వచ్చిన ఛాట్‌ బోట్‌ ద్వారా 2 నెలల్లో 10 కోట్ల యూజర్లను సొంత చేసుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో 375 మంది ఉద్యోగుల చిన్న స్టార్టప్ ఓపెన్ ఏఐ 30 బిలియన్‌ డాలర్ల విలువైనదైంది. దీంతో, పోటీగా బార్డ్ ను తేవడంలో గూగుల్‌ తొందరపడక తప్పలేదు. గూగుల్‌ 6 సంవత్సరాలు కష్టపడి బార్డ్‌ను డెవలప్‌ చేసింది. గూగుల్‌ తన బార్డ్‌ను టెస్ట్‌ చేసే దశలోనే కొన్ని పదాల జవాబులు తప్పుగా చెప్పినట్లు రాయిటర్స్‌ ప్రకటించడంతో గగ్గోలు మొదలైంది. దీంతో సక్సెస్‌ ఫుల్‌గా వెలుతున్న మైక్రోసాఫ్ట్‌ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ షేర్లు 7.8 శాతం పడిపోయాయి. 100 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ సెర్చ్‌లో గూగుల్‌దే ఆధిపత్యం. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సర్చ్‌ చేస్తే ఇట్టు దొరుకుతుంది. ఈ సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా కిందటి ఏడాది గూగుల్‌ 10వేల కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది.

Also Read: Team India: ఘనంగా టైటిల్ వేట షురూ… పాక్‌పై భారత మహిళల గ్రాండ్ విక్టరీ

అయితే, ఏఐను ఆసరాగా చేసుకొని విజృంభిస్తున్న ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్‌తో గూగుల్‌ పీఠం కదులుతోంది. మైక్రోసాఫ్ట్‌ తమ సెర్చ్‌ ఇంజన్ బింగ్ ను సైతం సరికొత్త ఫీచర్స్‌తో తీర్చిదిద్ది, గూగుల్‌కు గట్టి పోటీ ఇవ్వనుండటంతో గూగుల్ ఇపుడు ఛాట్‌బోట్‌ బార్డ్‌ను అత్యంత హంగులతో డెవలప్‌చేసి ఇవ్వాలని తహతహలాడుతోంది. దీంతో ఈ రెండు కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్సీలో పోటీపడుతున్నాయి. ఈ పోటాపోటీ ఒక రకంగా మంచిదైతే, మరోరకంగా చెడ్డది. అనేక ఇతర సాంకేతిక విప్లవాల లానే దీనివల్లా కొత్త ఉద్యోగాలొస్తాయి. కొన్ని పాతవి పోతాయని నిపుణులు చెపుతున్నారు.

మరొక వైపు వ్యాపార కార్యకలాపాలలో ఏఐ వ్యవస్థలను జొప్పించడానికీ చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. ఐతే చాట్ బోట్‌లు తప్పుడు సమాచారం చెపుడుతండటంతో అమెరికాలో కొన్ని స్కూళ్ళలో ఛాట్‌ జీపీటీని నిషేధించారు. ఐనప్పటికీ సరైనా సమాచారం ఇచ్చేలా కనుక ఛాట్ బోట్స్‌ను డెవలప్‌ చేస్తే భవిష్యత్తులో ఈ రెండు కంపెనీల మధ్య పోటీ మరింతగా ఉండనుంది.