ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే గూగుల్ సెర్చ్ ఇంజిన్ (Google search engine) తన లోగో(Google Logo)లో దాదాపు పదేళ్ల తర్వాత కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ‘G’ అనే చిహ్నంలో ఈ మార్పులు జరగడం గమనార్హం. ఇప్పటి వరకూ నాలుగు సాలిడ్ కలర్స్ (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం) తో కూడిన గూగుల్ ‘G’ లోగోను చూసిన వినియోగదారులకు ఇప్పుడు ఇది కొత్త అనుభూతిని కలిగించనుంది.
PM Modi : హఠాత్తుగా ఆదంపూర్ వైమానిక స్థావరానికి మోడీ.. కీలక సందేశం
కొత్త లోగోలో ఈ సాలిడ్ కలర్స్ స్థానంలో గ్రేడియంట్ కలర్స్‌ను ఉపయోగించారు. అంటే ఎరుపు రంగు పసుపు రంగులోకి, పసుపు రంగు ఆకుపచ్చ రంగులోకి, అలాగే ఆకుపచ్చ రంగు నీలం రంగులోకి మెల్లగా మారుతూ కనిపిస్తుంది. ఈ మార్పు కేవలం ఎస్టెటిక్‌గా కాకుండా, గూగుల్ కొత్తగా ప్రవేశపెడుతున్న ఏఐ ఫీచర్లకు అనుగుణంగా డిజైన్ చేయబడినదిగా కంపెనీ చెబుతోంది. టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో వినియోగదారులకు మరింత ఆధునికంగా, సమర్థవంతంగా కనపడేందుకు ఈ లుక్కు తీసుకొచ్చినట్లు సమాచారం.
ఈ కొత్త లోగోను ఇప్పటికే కొన్ని Google సేవలలో ప్రారంభించగా, త్వరలో అన్ని ప్లాట్‌ఫామ్‌లలో దీనిని అమలు చేయనున్నారు. గూగుల్ చేసే ప్రతి చిన్న మార్పు కూడా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ప్రభావం చూపుతుందనడంలో సందేహమే లేదు. కొత్త ‘G’ లోగో వినియోగదారులకు చూపులో ఆకర్షణీయంగా ఉండే విధంగా తీర్చిదిద్దబడింది. ఇకపై గూగుల్ కొత్త రూపంలో, కొత్త డిజైన్‌తో, కొత్త ఫీచర్లతో ముందుకెళ్తోంది.