Gujarat High Court : గూగుల్‌కు గుజరాత్‌ హైకోర్టు నోటీసులు

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 03:29 PM IST

 

Gujarat High Court : చిన్నప్పటి న్యూడ్‌ ఫొటో(nude childhood pi)ను అప్‌లోడ్‌ చేసినందుకు ఓ వ్యక్తి ఈ-మెయిల్‌ ఖాతా(e-mail account)ను గూగుల్‌ బ్లాక్‌(google-blocks) చేసింది. దీనిపై ఆ వ్యక్తి గుజరాత్‌ హైకోర్టు(Gujarat High Court)ను ఆశ్రయించడంతో కోర్టు గూగుల్‌కు నోటీసులు(notice) జారీచేసింది. చిన్నప్పటి న్యూడ్‌ ఫొటోను అప్‌లోడ్‌ చేయడంలో తప్పేముందని, అందుకు అతని ఈ-మెయిల్‌ ఖాతాను బ్లాక్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆ నోటీసులలో ప్రశ్నించింది.

We’re now on WhatsApp. Click to Join.

గుజరాత్‌కు చెందిన నీలా శుక్లా అనే కంప్యూటర్ ఇంజినీర్‌ తన చిన్నప్పటి ఫొటోలను గూగుల్‌ డ్రైవ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. వాటిలో శుక్లాకు రెండేళ్ల వయసున్నప్పుడు వాళ్ల నానమ్మ అతనికి స్నానం చేయిస్తున్న ఫొటో కూడా ఉంది. దాంతో ‘ఎక్స్‌ప్లిసిట్‌ చైల్డ్‌ అబ్యూజ్‌’ కింద గూగుల్‌ 2023 ఏప్రిల్‌లో శుక్లా ఈ-మెయిల్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. ఆ తర్వాత తన ఈ-మెయిల్‌ ఖాతా పునరుద్ధరణ కోసం అతను ఎన్ని గూగుల్‌తో ఎన్ని ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది.

read also: Work From Home : వర్క్ ఫ్రంహోం చేస్తే నో ప్రమోషన్.. కీలక ప్రకటన

దాంతో శుక్లా గుజరాత్‌ పోలీసులను, ఈ తరహా సమస్యల పరిష్కారానికి దేశంలో నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించే కేంద్ర శాస్త్రసాంకేతిక విభాగానికి కూడా శుక్లా ఫిర్యాదు చేశారు. వాళ్లు కూడా శుక్లా సమస్యను పరిష్కరించలేదు. పైగా ‘వచ్చే ఏప్రిల్‌ నాటికి మీ ఖాతా నిరుపయోగంగా ఉండి సంవత్సరం పూర్తి కానున్నందున పూర్తిగా రద్దు చేయబోతున్నాం’ అని గూగుల్‌ నుంచి శుక్లాకు నోటీస్‌ వచ్చింది. దాంతో ఆయన మార్చి 12న గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. శుక్లా పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ వైభవి డీ నానావతి ధర్మాసనం.. మార్చి 15న పిటిషన్‌పై వివరణ కోరుతూ గూగుల్‌కు నోటీసులు ఇచ్చింది.