SBI Services: ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంక్ కు వెళ్లకుండానే అన్నీ సేవలు!

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు కొత్త టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
SBI Service Down

Sbi

SBI: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు కొత్త టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. కస్టమర్ లకు ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి బ్యాంకింగ్ సేవలను సులువుగా అందించడం కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా బ్యాంకింగ్ సేవలను కస్టమర్లకు అందించడానికి ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులలో పనులు పూర్తి చేసుకోవడానికి ఎక్కువ సమయాలు వేచి చూడకుండా ఉండడానికి ఆదివారాలు సెలవు దినాలలో కూడా అనేక సేవలను పొందే అవకాశం కల్పించింది ఎస్బిఐ. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రెండు కొత్త టోల్ ఫ్రీ నంబర్లు eve 1800 1234 లేదా 1800 2100. కస్టమర్లు రెండు నంబర్లకు డయల్ చేయడం చేసి తమ బ్యాంకింగ్ అవసరాలను తీర్చుకోవచ్చు.

దీనికి సంబంధించి ఎస్‌బీఐ చేసిన ఓ ట్వీట్‌లో మీ బ్యాంకింగ్ అవసరాలను తీర్చుకోండి, కేవలం కాల్ చేయండి. ఎస్బిఐ కాంటాక్ట్ సెంటర్‌ టోల్‌ఫ్రీ నంబర్లు 1800 1234 లేదా 1800 2100ల ద్వారా సేవలను పొందవచ్చట. ఈ టోల్ ఫ్రీ నెంబర్లు కార్డు బ్లాక్ చేయడం అలాగే కార్డులను రిక్వెస్ట్ చేయడం వంటి అనేక బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తాయట. ఈ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు 24×7 అందుబాటులో ఉంటాయట. ఆదివారాలు సెలవు దినాలలో కూడా బ్యాంకులు లేని సమయంలో కూడాటోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చుట. ఎస్బిఐ టోల్ ఫ్రీ నంబర్లకి డయల్ చేయడం ద్వారా కస్టమర్‌లు తమ ఖాతా బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు.

అలాగే వారి చివరి ఐదు ట్రాన్సాక్షన్‌ల వివరాలు పొందవచ్చు. అలాగే వినియోగదారులు తమ ఎటిఎం కార్డ్ బ్లాకింగ్ స్టేటస్‌ను, అలాగే కార్డ్ డిస్పాచ్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా, కస్టమర్‌లు తమ చెక్‌బుక్‌ల డిస్పాచ్ స్టేటస్‌ని చెక్ చేయడంతో పాటు ఏదైనా కారణాల వల్ల మునుపటిది బ్లాక్ అయినట్లయితే కొత్త ఎటిఎం కార్డ్ కోసం రిక్వెస్ట్‌ చేయవచ్చు. కస్టమర్లు ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించి ఇ-మెయిల్ ద్వారా వారి టీడీఎస్‌ వివరాలను, డిపాజిట్ వడ్డీ ధ్రువీకరణ పత్రాన్ని కూడా పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి నంబర్లను డయల్ చేయవచ్చు. పైన ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్లకు దేశంలోని అన్ని ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి ఫోన్‌ చేసి సేవలు పొందవచ్చు అని ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఖాతా బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్‌ల వివరాలను 24 గంటల్లో ఫోన్‌లో తెలుసుకునే సదుపాయం ఉంది.

  Last Updated: 04 Jul 2022, 09:47 PM IST