రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం ‘సవరించిన వడ్డీ రాయితీ పథకం’ (Modified Interest Subvention Scheme – MISS)ను 2025-26 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను 7% వడ్డీ రేటుతో పొందవచ్చు. ముఖ్యంగా రుణాన్ని సకాలంలో చెల్లించిన రైతులకు 3% వడ్డీ రాయితీ లభించి మొత్తంగా కేవలం 4% వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
Miss World Grand Finale: రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్.. హైటెక్స్ వేదికగా కార్యక్రమం, జడ్జిలు వీరే!
ఈ పథకం కేవలం పంట సాగు కోసమే కాకుండా, పశుపోషణ మరియు మత్స్యకార రంగాల కోసం కూడా వర్తిస్తుంది. రైతులు ప్రత్యేకంగా MISS కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కేవలం KCCకు సంబంధించి బ్యాంకులో దరఖాస్తు చేస్తే ఈ వడ్డీ రాయితీ ఆటోమేటిగ్గా వర్తిస్తుంది. ఆధార్, పాన్, భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించడం మాత్రమే సరిపోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రముఖ బ్యాంకులు ఈ రుణాలను అందిస్తున్నాయి.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా చిన్న మరియు సన్నకారు రైతులకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇప్పటికే దేశంలో 7.75 కోట్ల కేసీసీ ఖాతాలుండగా, ఈ సంఖ్యను 2025-26 నాటికి 10 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు రుణాల మంజూరులో అగ్రస్థానంలో ఉండగా, ప్రత్యేక డ్రైవ్‌లు ద్వారా మరిన్ని రైతులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలని కేంద్రం చూస్తోంది. కేంద్రం 2025 బడ్జెట్‌లో MISS కోసం రూ. 23,000 కోట్లు కేటాయించగా, 2026 నాటికి ఇది రూ. 25,000 కోట్లకు చేరనున్నట్లు అంచనా.