Central Railway Recruitment 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…ఎగ్జామ్ లేకుండానే రైల్వేలో ఉద్యోగం పొందే ఛాన్స్…!!

నిరుద్యోగులకు శుభవార. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది సెంట్రల్ రైల్వే బోర్డు.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 05:14 PM IST

నిరుద్యోగులకు శుభవార. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది సెంట్రల్ రైల్వే బోర్డు. సెంట్రల్ రైల్వే టీచర్ పోస్టుల భర్తీకోసం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ తో వాక్ ఇన్ ఇంటర్వ్యూకూ హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ అక్టోబర్ 4న నిర్వహిస్తున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది.

ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు:
ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా PGT, TGT, PRT పోస్టుల్లో మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. వీటిలో PGT 05, TGT08, PRT 09 పోస్టులు ఉన్నాయి. సబ్జెక్ట్ వారిగా ఖాళీల వివరాలు తెలుసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ లింక్ చూడండి.

ఎవరు అర్హులు:
1. PGT : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ లేదా B.ED,చేసి ఉండాలి.
2. TGT: హిందీ,ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బీఈడీ చేసి ఉండాలి.
3. PRT:ఇంటర్మీడియట్ లో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి.

వయోపరిమితి:
అర్హత గత అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 65 సంవత్సరాలు ఉండాలి.

అవసరమైన పత్రాలు :
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు అప్లికేషన్ ఫాంతో పాటు బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫై సర్టిఫికేట్ తోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పకుండా తీసుకెళ్లాలి.

వేతనం:
పీజీటీకి నెలకు రూ. 27,500 కన్నాలిడేటెడ్ నెలవారీ ప్రాతిపదికన టీజీటీకి రూ. 6,250, పీఆర్ టీకి రూ. 21,250వేతనం,రిక్రూట్ మెంట్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్ను చూడండి.

సెంట్రల్ రైల్వే టీచర్ రిక్రూట్ మెంట్ 2022 నోటిఫికేషన్

ఇంటర్వ్యూ ఎక్కడ?
అర్హతగల అభ్యర్థులు పైన పేర్కొన్న పత్రాలతో అక్టోబర్ 04న భుసావల్ లో ఉన్న DRMకార్యాలయంలో ఇంటర్వ్వూకు హాజరుఅవ్వాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.