9144 Jobs : రైల్వేలో 9144 జాబ్స్.. నెలకు రూ.30వేల జీతం

9144 Jobs : రైల్వే‌శాఖ 9144 ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Written By:
  • Updated On - March 10, 2024 / 12:45 PM IST

9144 Jobs : రైల్వే‌శాఖ 9144 ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవన్నీ టెక్నీషియన్ పోస్టులే. 1092  టెక్నీషియన్ గ్రేడ్​-1 సిగ్నల్ పోస్టులు,  8052 టెక్నీషియన్ గ్రేడ్​-3 సిగ్నల్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపికయ్యే అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో జాబ్ చేయాల్సి ఉంటుంది. పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన వారు అప్లై చేయొచ్చు.

Also Read : Miss World 2024 : ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా గొప్ప పనులు.. తెలుసా ?

  • టెక్నీషియన్​ గ్రేడ్​-1 సిగ్నల్ పోస్టులకు అప్లై చేసేవారి వయసు 2024 జులై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • టెక్నీషియన్​ గ్రేడ్​-3 సిగ్నల్ పోస్టులకు అప్లై చేసేవారి వయసు 2024 జులై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు, మాజీ సైనికులు, ఈబీసీ, మైనారిటీ, ట్రాన్స్​జెండర్​, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
  • టెక్నీషియన్ గ్రేడ్​-1 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 వేతనం ఉంటుంది.
  • టెక్నీషియన్ గ్రేడ్​-3 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 వేతనం ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join

  •  ఈ పోస్టులకు(9144 Jobs) అప్లై చేసే అభ్యర్థులకు ఫస్ట్, సెకండ్ స్టేజ్​ల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి.. క్వాలిఫై అయిన అభ్యర్థులను టెక్నీషియన్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్​సైట్​ https://www.rrbapply.gov.in/ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు రుసుము ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • ఆన్​లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి  తేదీ ఏప్రిల్​ 18.

Also Read :DSC Hall Tickets : 25 నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు.. ఎగ్జామ్ కొత్త షెడ్యూల్

సెంట్రల్​ ఆర్మ్​డ్ ఫోర్సెస్​లో బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ ఉంటాయి. స్టాఫ్​ సెలక్షన్ కమిషన్​ ఈ ఏడాది ఢిల్లీ పోలీసు, సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీసు ఫోర్సెస్​ల్లోని సబ్​-ఇన్​స్పెక్టర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సెంట్రల్ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్‌లో  4001 సబ్​-ఇన్​స్పెక్టర్ (జీడీ)​ పోస్టులు, ఢిల్లీ పోలీస్ (పురుషులు)లో 125 సబ్​-ఇన్​స్పెక్టర్​ (ఎగ్జిక్యూటివ్​) పోస్టులు, ఢిల్లీ పోలీస్ (మహిళలు)​లో  61 సబ్​-ఇన్​స్పెక్టర్​ (ఎగ్జిక్యూటివ్​) పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు ఆఖరు తేదీ  మార్చి 28.

Also Read : Fake Video : ‘Hashtagu ‘ పేరుతో దుష్ప్రచారం..