Site icon HashtagU Telugu

7951 Jobs : రైల్వేలో 7951 జాబ్స్.. ప్రారంభ శాలరీ నెలకు రూ.44వేలు

7951 Railway Jobs

7951 Jobs : 7,951 పోస్టుల భర్తీకి  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 7,934 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మరో 17 కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు(Railway Jobs)  ఎంపికయ్యే వారికి సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో పోస్టింగ్ ఇస్తారు. 17 కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ పోస్టులకు(7951 Jobs) ఎంపికయ్యే వారికి ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ పరిధిలో పోస్టింగ్ లభిస్తుంది.స్టేజ్‌-1, స్టేజ్‌-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join

శాలరీలు ఎంతో తెలుసా ?

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ పాసైన వారు ఈ జాబ్స్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 36 ఏళ్లలోపు వయసు కలిగిన వారు అర్హులు. వయో పరిమితిలో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500. ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లు, ఎస్టీ,ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు రూ.250. జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికయ్యే వారికి తొలుత ప్రతినెలా రూ.35,400 దాకా శాలరీ ఇస్తారు.  కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ పోస్టులకు ఎంపికయ్యే వారికి తొలుత ప్రతినెలా  రూ.44,900 శాలరీ లభిస్తుంది. జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌‌లో అప్లై చేయొచ్చు. దరఖాస్తులో సవరణలను చేసుకునేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 8 వరకు ఛాన్స్ ఇస్తారు.