Site icon HashtagU Telugu

4600 RPF Jobs : రైల్వేలో 4660 ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టులు.. అప్లై చేసుకోండి

4600 Rpf Jobs

4600 Rpf Jobs

4600 RPF Jobs : 4660 రైల్వే ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి  రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు https://rpf.indian railways.gov.in/RPF/  వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. భర్తీ చేయనున్న మొత్తం 4660 పోస్టులలో(4600 RPF Jobs).. ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ పోస్టులు​ 4208, ఆర్​పీఎఫ్ ఎస్​ఐ పోస్టులు 452 ఉన్నాయి.  కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సబ్​-ఇన్​స్పెక్టర్ పోస్టులకు అప్లై చేయొచ్చు. కనీసం పదోతరగతి చదివిన వారు కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఎస్ఐ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. కానిస్టేబుల్​ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Tonique Liquor : ‘టానిక్ లిక్కర్’‌పై రైడ్స్.. అందులో పార్ట్‌నర్స్ ఎవరో తెలుసా ?

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు తొలుత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో పాసయ్యే వారికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ), ఫిజికల్ మెజర్​మెంట్​ టెస్ట్ (పీఎంటీ) చేస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఉద్యోగానికి షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి అర్హులైన అభ్యర్థులు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

Also Read :Gaganyaan – 48 Sites : ‘గగన్‌యాన్‌’ వ్యోమగాముల ల్యాండింగ్‌కు 48 సైట్లు.. ఎందుకు ?