Site icon HashtagU Telugu

Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త..దేశవ్యాప్తంగా 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై

Good news for railway passengers.. Free WiFi at 6,115 stations across the country

Good news for railway passengers.. Free WiFi at 6,115 stations across the country

Indian Railways : దేశంలోని రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే ఒక గొప్ప బహుమతి అందించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే భాగంగా, దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇటీవల ఆగస్ట్ 8న రాజ్యసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ అడిగిన లిఖిత ప్రశ్నకు మంత్రి సమాధానంగా వెలువడింది. మంత్రి పేర్కొన్నట్లుగా దేశంలోని ఎక్కువశాతం రైల్వే స్టేషన్ల పరిధిలో ఇప్పటికే టెలికాం సంస్థలు 4జీ మరియు 5జీ సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులు తమ మొబైల్ డేటా ద్వారా ఈ సేవలను వినియోగిస్తున్నారు. అయితే ప్రయాణికుల మరింత సౌలభ్యార్థం కోసం, 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం  అని వెల్లడించారు.

Read Also: Heavy rains : తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

ఈ ఉచిత ఇంటర్నెట్ సేవలను రైల్‌టెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘రైల్‌వైర్’ నెట్‌వర్క్ ద్వారా అందిస్తున్నారు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్ ఆన్ చేసి, అందులో ‘RailWire’ అనే నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి. ఆపై మొబైల్ నంబర్ నమోదు చేసి, వచ్చే ఓటీపీ (OTP)ను ఎంటర్ చేస్తే ఉచిత వైఫై సదుపాయం సిద్ధంగా ఉంటుంది. ఈ సేవలు ప్రయాణికులు స్టేషన్‌లో ఉన్నంతవరకు వినియోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ క్రింద దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ రైల్వే స్టేషన్లు ఇప్పటికే ఈ వసతిని పొందాయి. తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లు ఇందులో భాగమవగా, ఇతర రాష్ట్రాల్లో న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, బెంగళూరు – యశ్వంత్‌పుర్, హౌరా, అహ్మదాబాద్, భోపాల్, పుణె, భువనేశ్వర్, అమృత్‌సర్, ఎర్నాకుళం, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

ఈ ఇంటర్నెట్ సేవల వల్ల ప్రయాణికులు స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సమయంలో అనేక డిజిటల్ అవసరాలను తీర్చుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ఆన్‌లైన్ పనులు, వీడియో కాన్ఫరెన్స్‌లు, వినోదాత్మక వీడియోల వీక్షణం వంటి పనులు సులభతరమవుతాయి. ముఖ్యంగా, నిరంతర ఇంటర్నెట్ అవసరమున్న విద్యార్థులు, ఉద్యోగులు వంటి ప్రయాణికులకి ఇది ఒక పెద్ద సహాయం అవుతుంది. ఈ విధంగా భారతీయ రైల్వే, ప్రయాణ అనుభవాన్ని మరింత డిజిటల్ మైనంగానూ, సౌకర్యవంతంగా మారుస్తోంది. ఒకవేళ మీరు వచ్చే ప్రయాణంలో ఈ స్టేషన్లలో ఎక్కడైనా దిగితే, ‘RailWire’ వైఫైను ఉపయోగించి, మీ ఇంటర్నెట్ అవసరాలను తీరచేసుకోగలుగుతారు. ఈ పరిణామం, రైల్వేను కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా, డిజిటల్ కనెక్టివిటీకి కూడానీ హబ్‌గా నిలిపే దిశగా ముందడుగు అని చెప్పవచ్చు.

Read Also: Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ‘స్త్రీ శక్తి’కి సర్వం సిద్ధం!