18799 Jobs : బంపర్ ఆఫర్.. మూడింతలు పెరిగిన రైల్వే ఏఎల్‌పీ జాబ్స్

జాక్‌పాట్ అంటే ఇదే.  వాళ్లంతా  రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) జాబ్స్‌కు అప్లై చేశారు.

  • Written By:
  • Updated On - June 20, 2024 / 08:46 AM IST

18799 Jobs : జాక్‌పాట్ అంటే ఇదే.  వాళ్లంతా  రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) జాబ్స్‌కు అప్లై చేశారు. అప్లై చేసిన టైంలో కేవలం 5,696 ఏఎల్‌పీ పోస్టులే ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టుల సంఖ్యను మూడురెట్లు పెంచారు. దీంతో వాటి సంఖ్య 18,799కి(18799 Jobs) చేరింది. అంతేకాదు ఈ జాబ్స్‌కు అప్లై చేసుకున్న అభ్యర్థుల వయోపరిమితిని కూడా 30 నుంచి 33 ఏళ్లకు పెంచారు. వెరసి ఏఎల్‌పీ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలామేరకు పెరిగాయి.

We’re now on WhatsApp. Click to Join

ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన టైంలో మన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 585 ఏఎల్‌పీ పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్‌ను మూడురెట్లు పెంచడంతో వాటి సంఖ్య 1949కి చేరింది. ఏదిఏమైనా ఇది చాలా పెద్ద జాబ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ. ఇక  సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే‌లో ఏఎల్‌పీ జాబ్స్ సంఖ్య   1192 నుంచి 3973కు పెరిగింది. సెంట్రల్ రైల్వేలో ఏఎల్‌పీ జాబ్స్ సంఖ్య  535 నుంచి 1786కు పెరిగింది.

Also Read :25 Dead : కల్తీ నాటుసారా తాగి 25 మంది మృతి.. 10 మంది పరిస్థితి విషమం

ఈ ఏడాది జనవరి 20న రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన టైంలో వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) పోస్టులు ఉన్నాయి. తాజాగా జూన్ 19న రైల్వేశాఖ చేసిన ప్రకటన ప్రకారం ఆ పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. అభ్యర్థులకు జూన్ నుంచి ఆగస్టు మధ్య సీబీటీ-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించే వారికి సెప్టెంబరులో సీబీటీ-2 పరీక్షలు నిర్వహిస్తారు. నవంబరులో ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష జరుగుతుంది. దీని తర్వాత ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. నవంబరు లేదా డిసెంబరులో ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వారికి రూ.19,900- రూ.63,200 నెలవారీ పే స్కేలును చెల్లిస్తారు.

Also Read : Heat Stroke Cases: దంచికొడుతున్న ఎండలు.. మార్చి- జూన్ మధ్య 40 వేలకు పైగా హీట్‌స్ట్రోక్ కేసులు!

రైల్వే జోన్లవారీగా పోస్టులు ఇలా…

రైల్వే జోన్ ప్రకటించిన ఖాళీలు పెరిగిన ఖాళీల సంఖ్య
సెంట్రల్ రైల్వే 535 1786
 ఈస్ట్ సెంట్రల్ రైల్వే 76 76
ఈస్ట్ కోస్ట్ రైల్వే   479 1595
ఈస్టర్న్ రైల్వే 415 1382
నార్త్ సెంట్రల్ రైల్వే 241 802
నార్త్ ఈస్టర్న్ రైల్వే   43 143
నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే    129 428
నార్తర్న్ రైల్వే 150 499
నార్త్ వెస్టర్న్ రైల్వే 228 761
సౌత్ సెంట్రల్ రైల్వే 585 1949
సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే 1192 3973
సౌత్ ఈస్టర్న్ రైల్వే   300 1001
సదరన్ రైల్వే   218 726
సౌత్ వెస్టర్న్ రైల్వే   473 1576
వెస్ట్ సెంట్రల్ రైల్వే  219 729
వెస్ట్రర్న్ రైల్వే 413 1376
మొత్తం ఖాళీలు 5,696 18,799