Schemes : రైతులకు శుభవార్త…ఈ స్కీమ్ ద్వారా ప్రతినెలా రూ. 3వేలు పెన్షన్ పొందవచ్చు..!!

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అందిస్తోంది. కేంద్రం అందించే స్కీమ్స్ లో పీఎం కిసాన్ మన్ ధన్ యోజన కూడా ఉంది.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 10:13 AM IST

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అందిస్తోంది. కేంద్రం అందించే స్కీమ్స్ లో పీఎం కిసాన్ మన్ ధన్ యోజన కూడా ఉంది. ఈ స్కీంతో రైతులు ఎన్నో లాభాలు పొందవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పథకం కింద 60 సంవత్సరాల నిండిన వారికి నెలకు రూ. 3,000 పెన్షన్‌ ఇస్తోంది. ఈ స్కీంతో వయస్సు మళ్లిన రైతులకు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుంది. లబ్ధిదారుడు మరణిస్తే, అతని/ఆమె జీవిత భాగస్వామి పెన్షన్‌లో 50% కుటుంబ పెన్షన్‌గా పొందేందుకు అర్హులు అవుతారు. ఈ కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ స్కీమ్ కు అర్హత ఏమిటి
2 హెక్టార్ల వరకు సాగు భూమి ఉండి… 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న చిన్న సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు అవుతారు. కిసాన్ మన్ ధన్ వెబ్‌సైట్ ప్రకారం రైతుల పేరు కూడా ఆగస్టు 1, 2019 నాటికి రాష్ట్ర భూ రికార్డులలో ఉండాలి. ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకునే రైతుల నెలవారీ ఆదాయం రూ.15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. రైతుకు ఆధార్ కార్డు,సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా జన్ ధన్ ఖాతా ఉండాలి. లబ్ధిదారుడికి 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత రైతు పింఛను మొత్తం కోసం క్లెయిమ్‌ను సమర్పించవచ్చు.

ఈ స్కీమ్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి
* సమీపంలోని సాధారణ సేవా కేంద్రాన్ని (CSC)వెళ్లాల్సి ఉంటుంది.
*భూమికి సంబంధించిన నమోదు ప్రక్రియ కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, చెక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ని తీసుకెళ్లండి.
* ఆధార్ తో లింక్ చేసుకునే ఒక అప్లికేషన్ ఫాం ఇస్తారు.
* తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది.
* పెన్షన్ నెంబర్ తోపాటు పెన్షన్ కార్డు వస్తుంది.
* maandhan.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చు.
* 1800267 6888 టోల్ నెంబర్‌కు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ పెన్షన్‌కు ఎవరు అర్హులు కాదు:
*నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీమ్ మొదలైన ఏదైనా ఇతర సామాజిక భద్రతా పథకాన్ని పొందుతున్న వ్యక్తులు .
* ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన లేదా జాతీయ పెన్షన్ పథకం ప్రయోజనాలను పొందుతున్న రైతులు.
* డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు, ప్రొఫెషనల్స్, ప్రభుత్వ ఉద్యోగులు, సాగు కోసం భూమి ఉన్నప్పటికీ, ఈ పథకానికి అర్హులు కారు.