Terrorism : శుక్రవారం రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు. కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అనుసరిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Read Also: Rajya Sabha : ఒక్క రాజ్యసభ సీటు.. రేసులో ఇద్దరు కీలక నేతలు
కశ్మీర్‌లో ఇప్పుడు యువకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. సినిమాహాళ్లు నిండుతున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వాల పనితీరుపై మండిపడ్డారు. అవి ఉగ్రవాదుల పట్ల మెతకవైఖరి అనుసరించాయని దుయ్యబట్టారు. ఇప్పుడు కశ్మీర్‌లో సాయంత్రం పూట కూడా సినిమాహాళ్లు తెరిచే ఉంటున్నాయి. జీ20 సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 వరకు అక్కడి యువతకు 40వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య, పెట్టుబడులు పెరిగాయి. జమ్మూకశ్మీర్, ఈశాన్య భారతంలోని ఉగ్రవాదం, తీవ్రవాదం దేశ వృద్ధికి ఆటంకాలు. వాటి వల్ల 92వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
మోడీ ప్రభుత్వ పాలనలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతం తగ్గాయి. ఉగ్రఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’ అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోడీ ప్రభుత్వం నెరవేర్చింది. మా ప్రభుత్వ హయాంలో నక్సలిజాన్ని దాదాపుగా రూపుమాపాం. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా అణిచివేశాం కశ్మీర్‌లో రాళ్లురువ్వే సంఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే మా హయాంలో కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. వేర్పాటు వాదానికి ఆర్టికల్ 370 మూల కారణం. పిఎఫ్ఐ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాం. బింద్రే సానుభూతిపరులను జైలు ఊచలు లెక్కబెట్టించాము అని అమిత్ షా వివరించారు.
Read Also: Electricity Tariff Hike : విద్యుత్ చార్జీల పెంపు పై TGSPDCL సీఎండీ కీలక ప్రకటన