FD Rates: ఫిక్స్‎డ్ డిపాజిట్ చేసేవారికి గోల్డెన్ ఛాన్స్. 9.00శాతం వడ్డీని అందిస్తున్న చిన్న బ్యాంకులు

స్టాక్ మార్కెట్ పతనం, అనిశ్చితి దృష్ట్యా బ్యాంక్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం మంచి ఎంపిక . రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 09:22 AM IST

స్టాక్ మార్కెట్ పతనం, అనిశ్చితి దృష్ట్యా బ్యాంక్ ఎఫ్‌డిలో (FD Rates) పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం మంచి ఎంపిక . రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. కొన్ని బ్యాంకులు పెట్టుబడిదారులకు FDలపై 9 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD పై సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుండి 9.50 శాతం వరకు వడ్డీని అందిస్తోంది . 1001 రోజుల FDపై బ్యాంక్ అత్యధికంగా 9.50 శాతం వడ్డీని ఇస్తోంది. దీని తర్వాత, 181-201 రోజులు, 501 రోజులకు FDలపై 9.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు 15 ఫిబ్రవరి, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా గత నెలలోనే FD వడ్డీ రేట్లను పెంచింది. 700 రోజుల FDలో సాధారణ పెట్టుబడిదారులకు 8.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.00 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తోంది.

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మార్చి 24న కొత్త వడ్డీ రేట్లను అందిస్తోంది. దీని తరువాత, సీనియర్ సిటిజన్లకు 3.60 శాతం నుండి 9.01 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లు 1001 రోజుల FDలపై బ్యాంకు నుండి గరిష్టంగా 9.01 శాతం వడ్డీని పొందుతున్నారు.

రెపో రేటు పెంపు:

గతేడాది మే 2022 నుండి, RBI రెపో రేటును పెంచడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ 2.50 శాతం పెరిగింది. దీంతో రెపో రేటు 4.00 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది.