Gold Price Today : బంగారం కొనేందుకు మంచి సమయం..!

Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. ఇటీవల గోల్డ్ రేట్లు భారీగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గరిష్టాల నుంచి పడిపోయాయి. వరుసగా రెండు రోజుల్లో భారీగా తగ్గి ఇప్పుడు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 16న ఉదయం 10 గంటల లోపు పసిడి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Published By: HashtagU Telugu Desk
Gold And Silver Rate

Gold And Silver Rate

Gold Price Today : భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది, ముఖ్యంగా మహిళలు పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే ఆసక్తిని చూపిస్తారు. అలంకరణ కోసం వినియోగించే ఈ బంగారం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో విస్తృతంగా అనుబంధం కలిగి ఉంటుంది. ఈ సమయాల్లో సాధారణంగా బంగారానికి ఉన్న డిమాండ్ మరింత పెరుగుతుంది. అయితే, ఇటీవల పసిడి ధరలు గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికైన తరువాత, పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి పతనమయ్యాయి. అనంతరం కొంత కాలం తరువాత పసిడి ధరలు పెరిగినా, గత రెండు రోజుల్లో మరోసారి పతనం అయ్యాయి. డిసెంబర్ 16 న శోధించిన సమయంలో, స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2654 డాలర్లు రాగలవగా, స్పాట్ సిల్వర్ ధర 30.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 84.82 వద్ద ట్రేడవుతోంది, ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయిగా చెప్పవచ్చు.

దేశీయంగా గోల్డ్ రేట్లు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ. 71,400 వద్ద ట్రేడవుతోంది, 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు రూ. 77,890 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ. 71,550, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 78,040 వద్ద ఉన్నది. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 92,500, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. లక్ష పలుకుతోంది.

Read Also : Jawaharlal Nehru : నెహ్రూకు సంబంధించిన కాగితాలను తిరిగి ఇచ్చేయాలని రాహుల్‌కు లేఖ

  Last Updated: 16 Dec 2024, 11:22 AM IST