Gold Seized : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారం స్వాధీనం

భార‌త్ బంగ్లాదేశ్ బోర్డ‌ర్‌లో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం బంగారం స్మ‌గ్లింగ్ చేస్తున్న వారిని

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 07:57 AM IST

భార‌త్ బంగ్లాదేశ్ బోర్డ‌ర్‌లో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం బంగారం స్మ‌గ్లింగ్ చేస్తున్న వారిని ప‌ట్టుకుంది.దీని విలువ రూ.14 కోట్లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. మొత్తం బంగారం 23 కిలోలుగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లోని పరగణాస్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల ఇంద్రజిత్ ఈ బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేస్తున్నాడు.స్మగ్లర్ ఇంద్ర‌జిత్‌ 50 బంగారు బిస్కెట్లు, 16 బంగారు కడ్డీలతో పట్టుబడిన‌ట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు బలగాలకు పక్కా సమాచారం అంద‌డంతో స్మ‌గ్ల‌ర్‌పై నిఘా పెట్టారు. సైనికుల స్క్వాడ్ రోడ్డు పక్కన ఆకస్మిక దాడి చేయాల‌ని భ‌ద్ర‌తాద‌ళం ప్లాన్ వేసింది. ఆ రోడ్డులో అనుమానాస్పదంగా ఉన్న మోటార్‌సైకిల్ రైడర్‌ను ఆపి విచారించిన తర్వాత తన మోటార్‌సైకిల్‌ను వదిలి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన భ‌ద్ర‌తాద‌ళం అధికారులు అతడిని పట్టుకున్నారు.మోటార్ సైకిల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎయిర్ ఫిల్టర్ లో దాచిన బంగారం బయటపడింది. విచారణలో ఇంద్ర‌జిత్‌, అతని సోదరుడు నగల దుకాణాన్ని నడుపుతున్నట్లు వెల్లడించాడు. అతనిని సమీర్ అనే వ్యక్తి సంప్రదించాడ‌ని.. అతను రాంఘాట్ నుండి బంగావ్‌కు బంగారం రవాణా చేయడానికి నెలకు రూ.15,000 ఇచ్చాడ‌ని విచార‌ణ తేలింది. బంగారాన్ని అతని ఇంటి సమీపంలో అతనికి అప్పగించారు, ఆపై రవాణా కోసం తన బైక్‌లోని ఎయిర్ ఫిల్టర్‌లో దాచిన‌ట్లు ఇంద్ర‌జిత్ తెలిపారు. అరెస్టు చేసిన స్మగ్లర్‌, స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం బాగ్దాలోని కస్టమ్స్ కార్యాలయానికి అప్పగించారు.