Gold And Silver Price Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.51,600గా ఉంది.

Published By: HashtagU Telugu Desk
Gold- Silver Rate Today

Gold Silver Rate Today

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.51,600గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.56,290గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.70,200 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (మార్చి 02, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.56,440గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.56,290 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,340గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,290గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,290గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,000 ఉండగా, ముంబైలో రూ.66,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.70,200 ఉండగా, కోల్‌కతాలో రూ.67,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,200 ఉండగా, కేరళలో రూ.70,200గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,200 ఉండగా, విజయవాడలో రూ.70,200 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 02 Mar 2023, 07:06 AM IST