Site icon HashtagU Telugu

Gold Prices: బంగారం ధర మళ్ళీ పడిపోయింది.. ఎంత .. ఏమిటి ?

Gold Price

Gold Price

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ కూడా పడిపోయింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.11 శాతం పడిపోయింది. దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1769 డాలర్లకు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 19న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనిస్తే.. హైదరాబాద్‌లో బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,250 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు అయితే పది గ్రాములకు రూ. 47,900 వద్ద కొనసాగుతోంది.

గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన పసిడి రేటు ఇప్పుడు మాత్రం నేల చూపులు చూస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు దిగి వచ్చాయి.

1800 డాలర్ల స్థాయికి కిందకు చేరినబంగారం ధర. ఇటీవల కాలంలో 1800 డాలర్ల పైకి చేరింది. అయితే ఈ స్థాయిని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది. మళ్లీ వెనక్కి వచ్చేసింది. అయితే పసిడి రేటుకు ఇప్పుడు 1760 డాలర్లు అనేది కీలక స్థాయి అని నిపుణులు పేర్కొంటున్నారు. సమీప కాలంలో పసిడి గమనాన్ని ఇదే నిర్ణయిస్తుందని చెబుతున్నారు. ఈ స్థాయి పైన ఉంటే రానున్న కాలంలో బంగారం రేటు పైపైకి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ స్థాయికి కిందకు పడిపోతే అప్పుడు గోల్డ్ రేటు మరింత తగ్గొచ్చని తెలియజేస్తున్నారు. అప్పుడు 1720 డాలర్లకు దిగి రావొచ్చని పేర్కొంటున్నారు.

బంగారం ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47900గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52250గా ఉంది. విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47900గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52250గా ఉంది.

Exit mobile version