Site icon HashtagU Telugu

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..!

Gold

Gold

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 76,200 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (మార్చి 31, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై క్రిమినల్ అభియోగం.. త్వరలోనే అరెస్ట్..?

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,820గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,710గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,670 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,720గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,300 ఉండగా, ముంబైలో రూ.73,300గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, కోల్‌కతాలో రూ.73,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, కేరళలో రూ.76,200గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, విజయవాడలో రూ.76,200 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Exit mobile version