Gold Price : కిలోకు రూ.6.20 లక్షలు తగ్గిన బంగారం.. ఎందుకు ?

బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని (బీసీడీ) తగ్గించారు.

Published By: HashtagU Telugu Desk
Gold Rates

Gold Price : బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని (బీసీడీ) తగ్గించారు. ప్రత్యేకించి బంగారం(Gold Price), వెండిపై అంతకుముందు 10 శాతం దాకా బీసీడీ ఉండేది. అయితే  దీన్ని ఇప్పుడు 5 శాతానికి తగ్గించారు. బంగారం, వెండిపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకం (ఏఐడీసీ)ను 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. ఈమేరకు తగ్గింపుపై కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో ఆయా లోహాల ధరలు తగ్గాయి. దాదాపు 24 గంటల వ్యవధిలోనే కిలోకు రూ.6.20 లక్షల దాకా బంగారం రేటు తగ్గింది. కిలోకు రూ.3,000 దాకా వెండి రేటు తగ్గింది.

We’re now on WhatsApp. Click to Join

  • బడ్జెట్ ప్రకటనతో బంగారంపై ట్యాక్సుల లెక్కలు మారాయని.. దానిపై మొత్తం కస్టమ్స్‌ సుంకం 6 శాతానికి చేరిందని పేర్కొంటూ బులియన్‌ అసోసియేషన్లు తమ వర్తకులకు ఇన్ఫర్మేషన్ అందజేశాయి.
  • బంగారంపై జీఎస్‌టీ మాత్రం మునుపటిలా 3 శాతమే ఉంది.
  • మొత్తం మీద బంగారం-వెండిపై 15 శాతంగా ఉన్న పన్నుల భారం 6 శాతానికి చేరింది.
  • ప్లాటినంపై ఉన్న మొత్తం పన్నుల భారం 15 శాతం నుంచి 6.40 శాతానికి దిగి వచ్చింది.
  • జీఎస్టీతో కలిపి ఇప్పటివరకు బంగారం, వెండిపై ఉన్న పన్నుల భారం 18 శాతం నుంచి 9 శాతానికి చేరుతుంది.
  • ప్లాటినంపై ఉన్న పన్నుల భారం 18 శాతం నుంచి 9.40 శాతానికి చేరింది.

Also Read :Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌.. ఆట‌గాళ్ల‌కు పెట్టే ఫుడ్ మెనూ ఇదే..!

  • ఒక్కసారిగా సుంకంలో 9 శాతం దాకా విధించడంతో 24 క్యారెట్ల బంగారం రేటు కిలోకు రూ.77.50 లక్షల నుంచి రూ.71.30 లక్షలకు తగ్గింది. అంటే కిలోకు దాదాపు రూ.6.20 లక్షల మేర రేటు డౌన్ అయింది.
  • 10 గ్రాముల బంగారం ధర రూ.77,500. ఇది రూ.6,200 మేర తగ్గి రూ.71,300కు చేరింది.
  • కిలో వెండి ధర రూ.90,050. ఇదిరూ.3000 మేర తగ్గి రూ.87,000కు పరిమితమైంది.
  • తాజాగా జరిగిన పన్ను తగ్గింపుతో చోటుచేసుకునే మార్పులను రాబోయే 6 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
  • ఆ మార్పులకు అనుగుణంగా మార్కెట్‌ పరిస్థితులను బట్టి పన్నుల్లో హేతుబద్దీకరణకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది.
  • ప్రస్తుతం కస్టమ్స్‌ సుంకం(Basic Custom Duty) ద్వారా బంగారంతో పాటు ఇతర విలువైన లోహాలపై కేంద్రప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తోంది. దీన్ని ప్రస్తుతానికి తగ్గించినా.. త్వరలో జీఎస్‌టీని పెంచుతారనే టాక్ వినిపిస్తోంది. తద్వారా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ఆదాయం వస్తుందని అంటున్నారు.
  Last Updated: 24 Jul 2024, 07:56 AM IST