Gold Price Today : బంగారం అంటే మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన ఒక అమూల్యమైన భాగం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగల సమయంలో దాని ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. మహిళలు ఆభరణాలుగా బంగారాన్ని ధరిస్తుంటే, పెట్టుబడిగా చూడేవారు పసిడిని భద్రమైన ఆస్తిగా భావిస్తారు. బంగారంతో పాటు వెండి కూడా సమాన ప్రాముఖ్యతను పొందింది. ఈ కారణంగా వీటి ధరలను తెలుసుకోవడం చాలా అవసరం. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, దేశీయ డిమాండ్ వంటివి బంగారం, వెండి రేట్లను నిర్ధేశిస్తాయి.
ప్రస్తుతం భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తోంది. అయితే, గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గినా, నిన్నటి రోజు ఒక్కసారిగా పెరిగాయి. మరి ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో పరిశీలిద్దాం.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి రేట్లు
స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 2623 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 29.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి విలువ కాస్త కోలుకుని ప్రస్తుతం రూ.84.988 వద్ద ఉంది.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో:
22 క్యారెట్ల బంగారం: రూ. 71,000 (తులానికి)
24 క్యారెట్ల బంగారం: రూ. 77,450 (తులానికి)
ఢిల్లీలో:
22 క్యారెట్ల బంగారం: రూ. 71,150 (తులానికి)
24 క్యారెట్ల బంగారం: రూ. 77,600 (తులానికి)
వెండి ధరలు
దేశీయంగా వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో: కిలో వెండి రూ. 99,000
ఢిల్లీ మార్కెట్లో: కిలో వెండి రూ. 91,500
ఈ ధరలు సోమవారం ఉదయం 7 గంటల వరకు ఉన్నవే. మధ్యాహ్నానికి ధరల్లో మార్పు కలగొచ్చు, ప్రాంతానుసారం రేట్లు మారుతాయి. ట్యాక్స్‌లు, ఇతర అంశాలు ఈ వ్యత్యాసాలకు కారణం కావచ్చు. బంగారం, వెండి రేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం ఆర్థిక ప్రణాళికకు మేలుగా ఉంటుంది.
Read Also : Vastu Tips: మీ వంటగదిలో ఈ తప్పులు చేయకండి.. ముఖ్యంగా ఈ వస్తువులను కిచెన్‌లో ఉంచకండి!