Site icon HashtagU Telugu

Murder : గోవాలో ప్రేమజంట విషాదాంతం.. ప్రేయసిని గొంతుకోసి

Murder (2)

Murder (2)

Murder : పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. మధ్యలో తలెత్తిన ఘర్షణ కారణంగా ప్రియుడు తన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తర బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల సంజయ్ కెవిన్, అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల రోష్ని మోసెస్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల గోవా వెళ్లారు.

అయితే, అక్కడ ఆ ఇద్దరి మధ్య తీవ్రమైన వివాదం జరిగింది. ఆ రగడ తారాసమైంది. రెండు రోజుల క్రితం సంజయ్, రోష్ని గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని దక్షిణ గోవాలోని ప్రతాప్‌నగర్ అటవీ ప్రాంతంలో పడేసి పారిపోయాడు.

సోమవారం సాయంత్రం స్థానికులు ఆ అటవీ ప్రాంతంలో రోష్నికి చెందిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్య జరిగిందని నిర్ధారించారు. ఆ మృతదేహాన్ని రోష్ని మోసెస్‌గా గుర్తించారు.

హత్య జరిగిన విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లభించిన ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించి, అతడిని బెంగళూరులో అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు. ఈ హత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు.

Vijay-Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా దొరికేసారేంటీ..!