Site icon HashtagU Telugu

Goa Liquor Price : గోవాలో బీచ్ అందాలే కాదు..మద్యం ధరలు తక్కువే

Goa Liquor Price

Goa Liquor Price

ప్రకృతి ప్రియులే కాదు..మద్యం ప్రియులు కూడా గోవా (Goa) కు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. గోవా బీచ్ లో కూర్చుని..ఓ వైపు ప్రకృతి అందాలు..మరోవైపు అందమైన అమ్మాయిలు ఇలా రెండు కళ్లతో రెండు అందాలను చూస్తూ..చల్లటి బీరు తాగాలని ప్రతి మందుబాబు కోరుకుంటుంటారు. అంతే కాదు చాలామంది గోవా ప్లాన్ చేసుకొని వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా అక్కడ మద్యం ధరలు (Goa Liquor Price ) చాలంటే చాల చీఫ్..ఎంతలా అంటే అక్కడ రూ.100 లకు దొరికే మందు..మన తెలంగాణ లో రూ.246 కు లబిస్తుంటుంది. అంత వ్యత్యాసం ఉంటుంది. అందుకే చాలామంది వీకెండ్ లలో గోవా వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసి వస్తారు.

ఎందుకు అక్కడ మద్యం ధరలు తక్కువ అంటే…అక్కడ లిక్కర్ పై పన్ను రేటు తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దేశంలో తక్కువ పన్ను విధిస్తున్న రాష్ట్రం ఇదే. అందుకే అక్కడ రూ.100కు విక్రయించే లిక్కర్ (విస్కీ, రమ్, వోడ్కా, జిన్).. అత్యధికంగా కర్ణాటకలో రూ.513 పలుకుతోంది. గోవాలో రూ.100 పలికే మద్యం, తెలంగాణ (Telangana)కు వచ్చే సరికి రూ.246 పలుకుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే దీని ధర రూ.134గా ఉంటోంది. హర్యానాలో రూ.147, యూపీలోరూ.197, రాజస్థాన్ లో రూ.213, మహారాష్ట్రలో రూ.226 చొప్పున వీటి ధరలు ఉన్నాయి. రాష్ట్రాలు విధించే పన్నులకు తోడు విదేశీ మద్యంపై దిగుమతి సుంకాల భారం కూడా పడుతుంది. దీంతో రాష్ట్రాల మద్య విక్రయ ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. అందుకే చాలామంది మందుబాబులు గోవా వెళ్లి ఇష్టపూర్తిగా మద్యం సేవించి వస్తారు.

Read Also : Chicken: మీరు చికెన్ ను కడిగి వండుతున్నారా.. అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే