Site icon HashtagU Telugu

Go First Crisis : “గో ఫస్ట్” వాట్స్ నెక్స్ట్.. “ఎయిర్ ఇండియా” వైపు ఆ పైలట్ల చూపు!

Gfirst

Gfirst

ముంబై : వాడియా గ్రూప్ కు చెందినగో ఫస్ట్‌ ఎయిర్ లైన్స్ (Go First Crisis) దివాలా పిటిషన్ వేసిన తరుణంలో ఆ కంపెనీ ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. బయట ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. ప్రత్యేకించి గో ఫస్ట్‌ పైలట్లు కొత్త ఛాన్స్ ల వెతుకులాటలో ఉన్నారు. సరిగ్గా ఈ టైం లోనే టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న పైలట్‌ల రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు పెద్దసంఖ్యలో గో ఫస్ట్‌(Go First) పైలట్లు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. పైలట్ జాబ్స్ కోసం గత వారంలో ఎయిర్ ఇండియాకు 700 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 1,800 మందికి పైగా పైలట్లు పని చేస్తున్నారు. బోయింగ్, ఎయిర్‌బస్‌ సహా వివిధ కంపెనీలకు చెందిన 470 విమానాల కొనుగోలు కోసం కూడా ఎయిర్ ఇండియా ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చింది. వీటిలో వైడ్ బాడీ విమానాలు ఎక్కువగా ఉన్నాయి. అవి అందుబాటులోకి వస్తే .. మరింత మంది పైలట్లు ఎయిర్ ఇండియాకు అవసరం అవుతారు. అందుకే ఏప్రిల్ 27న ఎయిర్ ఇండియా 1,000 మందికి పైగా పైలట్‌ల కోసం ప్రకటన విడుదల చేసింది. A320, B777, B787, B737 ఫ్లీట్‌లో కెప్టెన్‌లు, ఫస్ట్ ఆఫిసర్స్, ట్రైనర్స్ కోసం వెతుకుతున్నామని వెల్లడించింది. దీనికి విపరీతమైన స్పందన వచ్చిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. టాటా గ్రూప్‌కు మొత్తం 4 విమానయాన సంస్థలు ఉన్నాయి. అవి.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, AIX కనెక్ట్, విస్తారా. విస్తారా అనేది సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్ వెంచర్. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, AIX కనెక్ట్‌తో పాటు విస్తారాను ఎయిర్ ఇండియాలో విలీనం చేసే ప్రక్రియలో ప్రసుతం టాటా గ్రూప్ ఉంది.

ALSO READ : Air India: కొత్త విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా భారీ డీల్..!

“గో ఫస్ట్” సర్వీసులు మళ్ళీ ఎప్పటినుంచి ?

లోకాస్ట్ బడ్జెట్ క్యారియర్ “గో ఫస్ట్” (Go First) గత 17 సంవత్సరాలుగా విమానాలను నడుపుతున్నది . అది ప్రతిరోజూ 180-185 ఫ్లైట్లను నడిపేది . ఈనెల మొదటి వారంలోనే సెక్షన్-10 కింద దివాలా పరిష్కార ప్రక్రియకు “గో ఫస్ట్” అప్లై చేసుకుంది. ఈ క్రమంలో దాని యజమాని వాడియా గ్రూప్ బ్యాంకులతో వన్-టైమ్ సెటిల్‌మెంట్‌కు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటి వరకు ఏ రుణంపై కూడా గో ఫస్ట్ డిఫాల్ట్ కాలేదు. కాబట్టి తాజా సెటిల్మెంట్ ప్రణాళిక ద్వారా ఆ సంస్థ భారీగా తగ్గింపును అది పొందుతుందని అంచనా వేస్తున్నారు. దివాలా పిటిషన్ పరిష్కారం కోసం మాత్రమేనని.. ప్రమోటర్ వాడియా గ్రూప్ “గో ఫస్ట్” ఎయిర్‌లైన్ నుంచి నిష్క్రమించడం లేదని గో ఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనా స్పష్టం చేశారు. మే 2న తన విమానాలను తాత్కాలికంగా రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు “గో ఫస్ట్” ప్రకటించింది. ఈనెల 12 వరకు విమానాలను నిలిపివేస్తున్నట్లు తాజాగా ఆ కంపెనీ తెలిపింది. టికెట్లు కొన్న ప్రయాణికులకు డబ్బు రీఫండ్ చేస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి “గో ఫస్ట్” కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ఛాన్స్ ఉందని పరిశిలకులు అంటున్నారు.