Site icon HashtagU Telugu

Union Budget 2024: ఇది బడ్జెట్ కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో: కాంగ్రెస్

Union Budget 2024

Union Budget 2024

Union Budget 2024: మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు పథకాలను ప్రారంభించారు. అయితే ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోనేనని వ్యాఖ్యానించింది కాంగ్రెస్. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆర్థిక మంత్రి చదివారని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం.

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్విట్టర్‌లో బీజేపీ పథకాలపై విమర్శలు కురిపించారు. గౌరవనీయ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివారని తెలిసి నేను సంతోషంగా ఉన్నాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 30వ పేజీలో ఉన్న ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్‌ఐ)ని ఆర్థిక మంత్రి ఆమోదించడం కూడా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 11వ పేజీ నుండి ప్రతి ట్రైనీకి భత్యంతో శిక్షణా పథకాన్ని ప్రారంభించినందుకు నేను కూడా సంతోషిస్తున్నాను.

కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి నిర్మలా సీతారామన్ మరికొన్ని ఆలోచనలను కాపీ కొట్టి ఉంటే బాగుండేదని ఆర్థిక మంత్రిని ఉద్దేశించి అన్నారు చిదంబరం. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏంజెల్ టాక్స్‌ను రద్దు చేశారని వినడానికి నేను సంతోషిస్తున్నాను. దీన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తోందని, అయితే దీనిపై త్వరలో మాట్లాడతానని చెప్పారు.

అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యతలను ముందుకు తెచ్చారు, ఇందులో ఉపాధి, నైపుణ్యాలు, వ్యవసాయం మరియు తయారీ రంగాలపై దృష్టి సారించారు. ఆర్థిక మంత్రి సీతారామన్ తన ఏడవ బడ్జెట్‌ను సమర్పిస్తూ ఈ బడ్జెట్‌లో ఉపాధి, నైపుణ్యాలు, MSME మరియు మధ్యతరగతిపై దృష్టి పెడతామని చెప్పారు. ఉత్పాదకత మరియు వాతావరణ అనుకూల రకాలను పెంచడానికి వ్యవసాయ పరిశోధన రూపాంతరం చెందుతుందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారత ప్రజలు విశ్వాసం ఉంచారని, చారిత్రాత్మకంగా మూడోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు.

Also Read: Anjali Birla : ఢిల్లీ హైకోర్టులో ఓం బిర్లా కుమార్తె పరువు నష్టం దావా.. ఎందుకో తెలుసా ?