Site icon HashtagU Telugu

PM Modi: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి: పీఎం మోడీ

Team India Defeat

Pm Modi (3)

PM Modi: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మోడీ మహిళలు, అమ్మాయిలు, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. “జాతీయ బాలికా దినోత్సవం నాడు, మేము ఆడపిల్లల తిరుగులేని స్ఫూర్తి, విజయాలకు వందనం చేస్తున్నాము. అన్ని రంగాలలో ప్రతి ఆడపిల్ల యొక్క గొప్ప సామర్థ్యాన్ని మేము గుర్తించాము” అని ప్రధాని మోదీ అన్నారు. “ఆడ పిల్లలు మన దేశాన్ని, సమాజాన్ని మెరుగుపరిచే మార్పు-నిర్మాతలు. ప్రతి ఆడపిల్ల నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది” అని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఆడ పిల్లల్లో సామాజిక అవగాహన పెంచి విద్య, ఆరోగ్య రంగాల్లో బాలికలు మరింత చురుకుగా ఉండేలా చూడటమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆడవాళ్లు వారి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సాంఘిక వివక్ష, దొపిడీని తొలగించడానికి, రాజకీయ, సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ గురించి ప్రజలకు చెప్పడానికి ప్రతి ఏడాది ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తుందన్నారు.

పిల్లల లింగ నిష్పత్తిని పెంచడానికి మరియు వివిధ చర్యల ద్వారా బాలికలకు సాధికారత కల్పించడానికి మోదీ ప్రభుత్వం 2015లో ‘ బేటీ బచావో బేటీ పఢావో ‘ (కూతుళ్లను రక్షించండి, కుమార్తెలను చదివించండి) అనే పథకాన్ని ప్రారంభించింది . కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది.