Delhi Girl Murder: ఢిల్లీలో యువతి దారుణ హత్య, 20సార్లు కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు!

ఢిల్లీలో సంచలనరీతిలో హత్య జరిగింది. పట్టపగలే ఓ యువకుడు 20 సార్లు కత్తితో పొడిచి యువతిని చంపేశాడు.

Published By: HashtagU Telugu Desk
Delhi Murder

Delhi Murder

ప్రేయసీ ప్రేమికుడు మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ ప్రాణాలు తీసేలా చేసింది. బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20సార్లు పొడిచి చంపేశాడు యువకుడు. సంచలనం రేపిన ఈ ఘటనలో 16 ఏళ్ల అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. ఢిల్లీలోని షహబాద్ డైరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. ఆ ప్రాంతంలోని JJ కాలనీకి చెందిన బాలిక మృతదేహం వీధుల్లో పడి ఉంది. ఈ ఘటనకు ముందు అమ్మాయి, అబ్బాయి గొడవ పడ్డారని తెలుస్తోంది.

ఓ బర్త్ డే పార్టీకి వెళ్తున్న క్రమంలో ఆమె ప్రియుడు అడ్డగించి రాయితో యువతిని కొట్టి చంపబోయాడు. అంతటి ఆగగ పలుమార్లు పొడిచి చంపాడు.  నిమిషం వ్యవధిలో 20 సార్లు అమ్మాయిపై కత్తితో పొడిచాడు. యువతి కాపాడాలని కేకలు వేసినా రక్షించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అమ్మాయిపై ఘోరంగా పొడిచి ఆ తర్వాత బుజ్జగించడం అందర్నీ షాక్ గురిచేసింది. నిందితుడిని వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులు ప్రయత్నాలు రంగంలోకి దిగారు.

ప్రస్తుతం నిందితుడు సాహిల్ పరారీలో ఉన్నాడు. అయితే అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ సుమన్ నల్వా చెప్పారు. ఈ భయంకరమైన దాడి సీసీటీవీలో రికార్డైంది. మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత కత్తిపోట్లు, ఇతర వైద్య వివరాలు వెల్లడిస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మాయి, అబ్బాయి స్నేహితులా? లేక ప్రేమికులా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: KTR Tweet: పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజే రెజ్లర్లపై దాష్టీకం దురదృష్టకరం: కేటీఆర్

  Last Updated: 29 May 2023, 03:31 PM IST