Melodi : ఇండియన్ మీమర్సా మజాకా.. మోడీతో కలిసి ఇటలీ ప్రధానమంత్రి ఇన్‌స్టా రీల్..

ఇండియన్ మీమర్సా మజాకా. మీ దుంపలతెగ ప్రధానమంత్రులను కూడా మార్చేసారుగా. మోడీతో కలిసి ఇటలీ ప్రధానమంత్రి ఇన్‌స్టా రీల్.

  • Written By:
  • Updated On - June 15, 2024 / 01:06 PM IST

Melodi : ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని వల్ల కేవలం సమాచారం తెలియడమే కాదు, ఎంతో మందికి ఉపాధి కూడా కలుగుతుంది. పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా విషయాలను తమదైన శైలిలో ప్రజలకు తెలియజేస్తూ.. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా సంపాదన అందుకుంటున్నారు. ముఖ్యంగా మీమర్స్ చేసే మీమ్స్.. ప్రజలకు సమాచారంతో పాటు నవ్వులను కూడా పంచుతుంది.

అయితే ఇండియన్ మీమర్స్ చేసే మీమ్స్ ఏ రేంజ్ లో ప్రభావితం చూపిస్తున్నాయంటే.. రెండు దేశాల ప్రధాన మంత్రులు కలిసి ఆ మీమర్స్ ని గ్రీట్ చేసేలా. అసలు విషయం ఏంటంటే.. పలు అంతర్జాతీయ సమావేశాల్లో మన దేశ ప్రధానమంత్రి మోడీ, ఇటలీ ప్రధానమంత్రి ‘జార్జియా మెలోని’ (Giorgia Meloni)ని కలుసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ మీటింగ్స్ కి సంబందించిన విజువల్స్ ని ఇండియన్ మీమర్స్.. ఎంటర్టైనింగ్ ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసారు.

అంతేకాదు, మోడీ అండ్ మెలోని పేరులను కలుపుతూ ‘మెలోడీ’ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా ఇచ్చారు. ఇక ఈ హ్యాష్ ట్యాగ్ తో ఎన్నో మీమ్స్, AI పాటల వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియోలను, మెలోడీ ట్రెండ్‌ని.. సాధారణ నెటిజెన్స్ తో పాటు ప్రధానమంత్రులు మోడీ, మెలోని కూడా ఫాలో అవుతున్నారు. వాటిని ఫాలో అవ్వడమే కాదు, దాని పై ఒక ఇన్‌స్టా రీల్ కూడా చేసారు.

ప్రస్తుతం ఇటలీలో జీ-7 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సమ్మిట్ కి మోడీ కూడా వెళ్లారు. ఇక అక్కడ ఇటలీ ప్రధాన మంత్రి మెలోని మోడీ కలుసుకోవడంతో.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే మీమర్స్ కోసం మెలోని ఓ వీడియోని షేర్ చేసారు. మోడీతో కలిసి రీల్ చేసిన మెలోని, ఆ రీల్ లో మాట్లాడుతూ.. “హలో మెలోడీ టీం” అంటూ మీమర్స్ ని గ్రీట్ చేస్తూ మెలోని రీల్ చేసారు. ఆ రీల్ ని మీరు కూడా చూసేయండి.