Site icon HashtagU Telugu

17-gun salute: యుద్ధ వీరుడా.. సెలవికా..!

Bipin

Bipin

CDS బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ కాంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో జరిగాయి. ఢిల్లీలో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనిక అధికారులు నివాళులర్పించారు. దహన సంస్కారాలను ఆయన కుమార్తెలు కృతిక, తారిణి నిర్వహించారు.  17 ఫిరంగులతో గన్ సెల్యూట్ చేశారు. అంతకుముందు సాయుధ దళాలు అతని సహాయకుడు బ్రిగేడియర్ LS లిడర్‌కు వీడ్కోలు పలికాయి. అంత్యక్రియల నిమిత్తం విస్తృత ఏర్పాట్లు చేశారు. దాదాపు 800 మంది సేవా సిబ్బంది పాల్గొన్నారు. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ, జాతీయ జెండాను ఊపుతూ అంత్యక్రియలు జరిపారు.

అంత్యక్రియలకు శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి సీనియర్ సైనిక కమాండర్లు హాజరయ్యారు. US, UK, చైనా, ఫ్రాన్స్, జపాన్, ఇజ్రాయెల్‌తో సహా అనేక దేశాల నుండి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నివాళులర్పించేందుకు హాజరయ్యారు. అలాగే సీనియర్ డిఫెన్స్ అధికారులు కూడా ఉన్నారు. డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన చాపర్ ప్రమాదంలో రావత్, అతని భార్య, మరో 11 మంది మరణించారు.

Exit mobile version