Site icon HashtagU Telugu

Gautam Gambhir : రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్‌బై.. నెక్ట్స్ ఫోకస్ దానిపైనే

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir : మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరని తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌పై మళ్లీ ఫోకస్ చేయాలని భావిస్తున్నందున రాజకీయాల నుంచి వైదొలగాలని గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నారు. ఇదేవిషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన తెలిపారు.  ‘‘రాబోయే క్రికెట్ కమిట్‌మెంట్‌లపై దృష్టి పెట్టడానికిగానూ రాజకీయ బాధ్యతల నుంచి వైదొలిగేందుకు నాకు ఛాన్స్ ఇవ్వండని జేపీ నడ్డాజీని కోరాను. ఇన్నాళ్ల పాటు  ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్’’ అని ట్విట్టర్ వేదికగా గంభీర్(Gautam Gambhir) ఓ పోస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Yuvraj Singh: రాజ‌కీయాల్లోకి యువరాజ్ సింగ్..? క్లారిటీ ఇచ్చిన యువీ..!

గతంలో కోల్‌కత నైట్ రైడర్స్‌ టీమ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మళ్లీ సొంతగూటికి చేరుకున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్ మెంటార్‌గా గతేడాది నవంబరు చివరి వారంలో అపాయింట్ అయ్యాడు. ఇదివరకు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లో గంభీర్ పని చేశాడు. ఇప్పుడు ఆ జట్టుకు గుడ్ బై చెప్పి కోల్‌కత నైట్ రైడర్స్‌ టీమ్‌లోకి వచ్చేశాడు.హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో కలిసి టీమ్‌కి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. 2011-17 మధ్య కాలంలో గౌతమ్ గంభీర్ కోల్‌కత నైట్ రైడర్స్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. 2012, 2014లో టైటిల్‌ కూడా గెలిచింది కోల్‌కతా టీమ్.