GATE 2024: ఈసారి గేట్- 2024 పరీక్ష (GATE 2024)ను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, సబ్జెక్టు వివరాలు తెలుసుకోవాలనుకునే వారు IISc బెంగళూరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అధికారిక వెబ్‌సైట్ చిరునామా – gate2024.iisc.ac.in. ఇక్కడ నుండి మీరు సాధ్యమయ్యే అన్ని తేదీల గురించి సమాచారాన్ని పొందుతారు. ఈ తేదీలు దాదాపుగా ఫైనల్ అయినప్పటికీ వాటిలో మార్పులు ఉండవచ్చు.
ఈ తేదీల్లో పరీక్ష
గేట్ 2024 పరీక్ష 3, 4, 10, 11 ఫిబ్రవరి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. ఈసారి 30 సబ్జెక్టులపై పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఒకటి లేదా గరిష్టంగా రెండు పరీక్ష పేపర్లు ఇవ్వవచ్చు. ఈసారి గేట్ పరీక్షలో రెండు కొత్త సబ్జెక్టులను కూడా చేర్చారు. అవి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ముఖ్యమైన తేదీలు ఇవేనా..?
IISc వెబ్‌సైట్‌లో ఈ తేదీలు మారవచ్చు అని స్పష్టంగా పేర్కొనబడింది. కాబట్టి అప్‌డేట్‌లను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ను విజిట్ చేస్తూ ఉండండి. ఆగస్టు చివరి వారంలో లేదా ఆగస్టు 24 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 29 సెప్టెంబర్ 2023. దరఖాస్తులో 7 నుండి 11 నవంబర్ 2023 వరకు సవరణలు చేయవచ్చు. అడ్మిట్ కార్డ్‌లు 3 జనవరి 2024 నుండి అందుబాటులో ఉంటాయి. ఆన్సర్ కీ ఫిబ్రవరి 21, 204న అందుబాటులో ఉంటుందని, అభ్యంతరాలను ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు తెలపవచ్చని తెలుస్తుంది. దీని తర్వాత ఫలితాలు 16 మార్చి 2024న విడుదల చేయబడతాయి. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను 23 మార్చి 2024 నుండి డౌన్‌లోడ్ చేసుకోగలరు.
Also Read: Today Horoscope : ఆగస్టు 16 బుధవారం రాశి ఫలితాలు.. వారు వాహన వినియోగంలో జాగ్రత్త వహించాలి
సిలబస్ ఇదేనా
సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ మొదలైన వివిధ విభాగాలకు గేట్ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 100 మార్కులకు, జనరల్ ఆప్టిట్యూడ్ 15 మార్కులకు ఉండే అన్ని పేపర్లలో ఉమ్మడిగా ఉంటుంది. మిగిలిన మార్కులు అంటే 85 మార్కులు సిలబస్‌ను కవర్ చేస్తాయి. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ప్రస్తుతం ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో 3వ సంవతర్సం లేదా ఆపై సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు గేట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే ఇంజినీరింగ్ / టెక్నాలజీ / ఆర్కిటెక్చర్ / సైన్సెస్ / కామర్స్ / ఆర్ట్స్‌లో ఏదైనా ప్రభుత్వ డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.