Site icon HashtagU Telugu

LPG cylinder price Hike : దేశ వ్యాప్తంగా గ్యాస్‌ ధరలు పెంపు

Gas prices increase across the country

Gas prices increase across the country

LPG cylinder price Hike : కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచింది. ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువుల శాఖమంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ వెల్లడించారు. ఈ ధరల పెంపు ఉజ్వల పథకం, జనరల్‌ కేటగిరీ వినియోగదారులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్‌పై చెల్లిస్తున్న దానిపై ఇకపై అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఉజ్వల పథకం సిలిండర్లపైనా రూ.50 పెంచుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నది. పెరిగిన ధరలు రేపు(మంగళవారం) నుంచే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

Read Also: Mary Kom Divorce: మేరీ కోమ్ విడాకులు.. మరో వ్యక్తితో లవ్.. ఎందుకు ?

సాధారణ వినియోగదారులకు 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కి, ఉజ్వల పథకం కింద వినియోగదారులకు 14.2 కిలోల సిలిండర్ ధర రూ.503 నుంచి రూ.553కి పెరగనుంది. దీనికి ముందు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసి వారం కూడా గడువకముందే మరోసారి రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయనే సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వరుస షాకులు ఇస్తూ వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొత్త రేట్లు ప్రకటించాయి.

Read Also: Pawan Kalyan : మీ బాగోగులు చూడటానికి మేం ఉన్నాం: పవన్‌కల్యాణ్‌