Site icon HashtagU Telugu

Garuda Drone Flood Fight : వరదలపై డ్రోన్ల యుద్ధం.. టెక్నాలజీని వాడుకుంటున్న ఎన్డీఆర్ఎఫ్

Garuda Drone Flood Fight

Garuda Drone Flood Fight

Garuda Drone Flood Fight :  వానలు, వరదలతో ఉత్తర భారత రాష్ట్రాలు వణుకుతున్నాయి.. 

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు.. 

గత 50 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి వర్షాలను చూడలేదని సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఇటీవల కామెంట్ చేశారు.. 

కొండలు, లోయలు ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు చుట్టుముట్టిన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడం జాతీయ విపత్తు స్పందన దళాల(ఎన్డీఆర్ఎఫ్)కు సవాలుగా మారింది. 

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఫుడ్స్, వాటర్, మెడిసిన్స్ పంపడం కష్టతరంగా ఉంది. 

ఈనేపథ్యంలో అటువంటి ప్రాంతాలకు నిత్యావసరాలను పంపేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ గరుడ డ్రోన్స్ ను వాడుతున్నాయి.  

Also read : Helicopter Drop-Chandrayaan 3 : హెలికాఫ్టర్ నుంచి జారవిడిచి “ల్యాండర్” టెస్ట్.. చంద్రయాన్ 3పై మరిన్ని విశేషాలివిగో

తమిళనాడుకు చెందిన గరుడ ఏరోస్పేస్ కంపెనీ గరుడ డ్రోన్స్ ను తయారు చేస్తోంది. “ఆహారం, నీరు, మందులను పంపిణీ చేయడానికి మేం తయారు చేసే గరుడ  డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ వర్క్స్ లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి” అని గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, CEO అగ్నిశ్వర్ జయప్రకాష్ తెలిపారు. అస్సాంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్ తో కలిసి వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రెండు  గరుడ డ్రోన్లను పంపామని(Garuda Drone Flood Fight) ఆయన చెప్పారు.

Also read : Paper Bag Day: ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు, పేపర్ బ్యాగుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి..!

ఒక్కో డ్రోన్ ను ఆపరేట్ చేయడానికి నలుగురు నిపుణుల టీమ్ కూడా వెళ్లిందని గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు జయప్రకాష్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో కూడా గరుడ డ్రోన్లను ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్  వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ డ్రోన్‌లు భూమికి దగ్గరగా (తక్కువ ఎత్తులో) ఎగరగలవు.  వరద ప్రాంతాలకు సంబంధించిన వీడియో ఫుటేజీని స్పష్టంగా తీసేందుకు కూడా గరుడ డ్రోన్స్ హెల్ప్ చేస్తాయి. వీటిలో థర్మల్ కెమెరాలు, LiDAR స్కానర్‌లు, పవర్ ఫుల్ సెన్సర్లు కూడా ఉన్నాయి.

Also read : Asia Cup 2023: ఆసియా కప్‌లో ఎలాంటి మార్పు లేదు.. శ్రీలంకలో భారత్-పాక్ మ్యాచ్..!