Chinese Apps: భారత్ లో 50 డ్రాగన్ కంట్రీ యాప్స్ పై నిషేధం

2020లో భారత ప్రభుత్వం చైనా యాప్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - February 15, 2022 / 11:53 PM IST

2020లో భారత ప్రభుత్వం చైనా యాప్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాదాపు 270 చైనా యాప్స్ పై నిషేధం విధించింది. అయితే భారత పౌరుల సమాచార భద్రత, గోప్యతతో పాటు దేశ సౌర్వభౌమతానికి భంగం వాటిల్లకూదన్న ఉద్దేశ్యంతో ఈ సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రం ప్రభుత్వం. అయినాకూడా డ్రాగన్ కంట్రీ గుట్టుచప్పుడు కాకుండా తమ దేశ యాప్స్ ను భారత్ లో ప్రవేశపెడుతూనే ఉంది. యాప్ పేర్లను కొత్త కంపెనీల పేరిట వాటిని నడిపిస్తోంది. వీటిన్నింటిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. చైనా మూలాలున్న మరో 50 స్మార్ట్ ఫోన్ యాప్ లపై కూడా తొందర్లోనే నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. అయినప్పటికీ నిషేధిత యాప్ ల లిస్టును అధికారికంగా వెల్లడించనప్పటికీ ఈటీ నౌ రిపోర్ట్ ఆయా యాప్స్ పేర్లను వెల్లడించింది.

ఈ లిస్టులో గరీనా ఫ్రీ ఫైర్ అనే మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్ గేమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి కనిపించకుండా పోయిందని…నిషేధానికి గురైన కొత్త యాప్స్ లిస్టులో ఈ గేమ్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై గేమ్ డిస్ట్రిబ్యూటర్ గరీనా ఇంటర్నేషనల్ నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సింది. కానీ ఈ గేమ్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ఎందుకు తొలగించారన్న దానిపై యాపిల్ కానీ, గూగుల్ కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

కాగా బ్యాన్ అయిన యాప్స్ పూర్తి జాబితా గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఈటీ నౌ రిపోర్టు ప్రకారం నిషేధిత యాప్స్ కొత్త జాబితలో 2020లో బ్యాన్ అయిన యాప్స్ కు చెందిన క్లోన్ యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత నిర్ణయంతో భారత్ లో ఇప్పటి వరకు ప్రభుత్వం నిషేధించిన యాప్స్ సంఖ్య 320కి చేరింది. టిక్ టాక్, పబ్జీ వంటి మొబైల్ గేమ్స్ తో సహా చాలా పాపులర్ యాప్స్ ను భారత ప్రభుత్వం గతంలోనే నిషేధించింది.

అయితే పబ్జీ గేమ్ ఇండియా దాని చైనీస్ భాగస్వాములతో సంబంధాలను తెంచుకుని భారత్ లోకి తిరిగి ప్రవేశించింది. క్రాప్టన్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఇది రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ డ్రాగన్ కంట్రీకి చెందిన పాపులర్ వీడియే షేరింగ్ యాప్ టిక్ టాక్ పై ఇంకా నిషేధం కొనసాగుతోంది.