Kolkata : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ కూతురు సనాకు పెను ప్రమాదమే తప్పింది. సనా గంగూలీ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. కోల్ కతాలోని డైమండ్ హార్బర్ లో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో సనా కారుకు డ్యామేజీ అయిందని, సనాకు మాత్రం గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును గంగూలీ డ్రైవర్ నడుపుతుండగా సనా పక్క సీటులో కూర్చుందని వివరించారు.
బెహలా చౌరస్తాలో సనా కారును ఢీ కొట్టిన బస్సు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడని చెప్పారు. డ్రైవర్ తో కలిసి సనా బస్సును వెంటాడి కొంతదూరం వెళ్లిన తర్వాత అడ్డగించిందన్నారు. తమకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు వివరించారు. యాక్సిడెంట్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సౌరవ్ గంగూలీ అతని భార్య, ప్రఖ్యాత ఒడిస్సీ డ్యాన్సర్ డోనా యొక్క ఏకైక సంతానం సనా గంగూలీ. తన విద్యా ప్రయాణాన్ని కోల్‌కతాలోని లోరెటో హౌస్‌లో ప్రారంభించింది. యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుండి ఎకనామిక్స్‌లో డిగ్రీని పొందింది. ప్రస్తుతం, ఆమె లండన్‌కు చెందిన బోటిక్ కన్సల్టింగ్ సంస్థ అయిన INNOVERVలో కన్సల్టెంట్‌గా పని చేస్తోంది.
Read Also: Tamil Nadu : బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి